ఆన్ లైన్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు

Online prostitution in Hyderabad

10:18 AM ON 8th October, 2016 By Mirchi Vilas

Online prostitution in Hyderabad

ఆన్ లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. మాదాపూర్ లోని ఓ అపార్ట్మెంట్ లో పోలీసులు సోదాలు నిర్వహించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సోదాలు నిర్వహిస్తున్న పోలీసులపై వ్యభిచార కేంద్రం నిర్వాహకులు దాడి చేశారు. ఈ దాడిలో సైబర్ క్రైం ఎస్సై మదన్, కానిస్టేబుల్ మహేష్ కు గాయాలయ్యాయి. అయితే మాదాపూర్ పోలీసుల సాయంతో ముగ్గురు యువకులు, యువతిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర, కోల్ కతా నుంచి యువతులను మాదాపూర్ తీసుకొచ్చి వ్యభిచారాన్ని నడిపిస్తున్నారు. ప్రధాన నిందితుడు సలీం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

English summary

Online prostitution in Hyderabad