ఇకపై కార్డు లేదూ గీర్డు లేదు... అంతా ఆధారేనట!

Online transactions is with aadhar card only

01:04 PM ON 3rd December, 2016 By Mirchi Vilas

Online transactions is with aadhar card only

ప్రస్తుతం నగదు రహిత లావాదేవీల గురించి, ప్రచారం జోరందుకోగా, భవిష్యత్తులో ఇక నగదే కాదు.. కార్డులు కూడా త్వరలో కాలగర్భంలో కలిసిపోనున్నాయా అనే రీతిలో చర్యలు మొదలయ్యాయట. అవును, భారత దేశాన్ని నగదు రహిత భారతగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం కొన్నాళ్లకు కార్డు లావాదేవీలను కూడా రద్దు చేసే దిశగా కసరత్తు చేస్తోంది. కేవలం ఆధార్ నంబర్ ఆధారంగా లావాదేవీలు జరిగే దిశగా అడుగులు వేస్తోందని అంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రస్తుతం ఆధార్.. ఫోన్.. వేలి ముద్ర ఆధారంగా ఒక నెట్ వర్క్ ను అభివృద్ధి చేస్తోంది. దీంతో మీరు ఆధార్ నంబరును చెప్పి, మీ వేలి ముద్రను ఫోన్ ద్వారా స్కాన్ చేసి మీ ఖాతాలోని డబ్బును ఇతరుల ఖాతాలకు పంపవచ్చు.

1/6 Pages

ఈ దిశగా సాఫ్ట్ వేర్ ను, ఫోన్లను అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి నీతి ఆయోగ్ ఒక పథకం రూపొందిస్తోందని అంటున్నారు. ఈ అంశంపై నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత మాట్లాడుతూ.. ఇకపైౖ దేశంలో ఉత్పత్తి చేసే ఫోన్లన్నీ వేలి ముద్రల(ఫింగ్ ప్రింట్) స్కానర్ ను లేదా కనుపాప(ఐరిస్) స్కానర్ ను కలిగి ఉండేలా చూడాలని మొబైల్ తయారీదారులను కోరుతున్నాం. ఈ ఫోన్లు అందుబాటులోకి వస్తే ఆధార్ ఆధారిత లావాదేవీలు జరిపేందుకు వీలుంటుంది.

English summary

Online transactions is with aadhar card only