ఆన్ లైన్ లో వాలెంటైన్స్‌ డే ఆఫర్ల సందడి

Online Valentine's Day Offers

10:12 AM ON 13th February, 2016 By Mirchi Vilas

Online Valentine's Day Offers

ప్రేమికుల రోజు ఏర్పడింది ఇలా ....

ఫిబ్రవరి 14ని ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నారు. పాశ్చాత్య సంస్కృతీ అని అందరూ అంటున్నా , ఏటా దీనికి ప్రాధాన్యత పెరిగిపోతూనే వుంది. అయితే ఇంతకీ ప్రేమికుల రోజు ఎందుకు వచ్చిందంటే, తన రాజ్యంలో పెళ్లైనవారి కంటే పెళ్లికాని యువకులే మంచి సామర్థ్యంగల సైనికులుగా తయారవడాన్ని క్షుణ్ణంగా గమనించిన రెండో సెయింట్‌ క్లాడియస్‌ తన రాజ్యంలో ఎవరూ పెళ్లిళ్లు చేసుకోకూడదని ఆజ్ఞాపించాడు. అయితే సెయింట్‌ వాలెంటెయిన్‌ రహస్యంగా ప్రేమికులకు పెళ్లిళ్లు చేయించడం మొదలు పెడతాడు. ఇది తెల్సిన క్లాడియస్‌ సీరియస్ అవుతాడు. దీంతో క్రీస్తు శకం 270 సంవత్సరంలో ఫిబ్రవరి 14న వాలెంటెయిన్‌ను చంపేశారు. ప్రేమను ప్రోత్సహిస్తూ, ఆ మాధుర్యాన్ని రాజ్యంలో వ్యాపింపజేసి తాను మాత్రం అసువులు బాసిన వాలెంటెయిన్‌కు గుర్తుగా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవడం మొదలైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అందుకే ఏటా ఫిబ్రవరి 14 వస్తే, ప్రేమికులకు పండగే పండగ.

ఇక వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఇంటర్ నెట్ లో ఆఫర్లే ఆఫర్లు .... ఒకటి కొంటె మరోటి ఉచితం, రెండు కొంటే మరో రెండు ఫ్రీ , ఇలా ఎన్నో ఆఫర్లు వరదలా ముంచేస్తున్నాయి. భార్యాభర్తలు.. ప్రేయసీప్రియుల కు ఇద్దరికీ ఒకే రకమైన ఉండే వాచీలు, మొబైల్స్ , చెప్పులు.. డ్రెస్ లు, ఒకటేమిటి అన్నీ సిద్ధం చేసారు. ఇక 30 నుంచి 60 శాతం డిస్కౌంట్లు సరే సరి, ఏ వెబ్‌సైటు తెరిచినా, ఈమెయిల్‌ తెరిచినా ఆఫర్లే ఆఫర్లు. మన ముందు ప్రతక్ష్యమవుతున్న ఆఫర్లు.. ఆన్ లైన్ బిజినెస్ హోరెత్తుతోంది. ఈ ఏడాది వెబ్‌సైట్లు కొత్తగా ఈ-గిఫ్ట్‌ కార్డులు, వోచర్లు అందుబాటులో కొచ్చాయి. రూ.500 నుంచి వేలల్లో గిఫ్ట్‌కార్డులు అందుబాటులో వున్నాయి. వాలెంటైన్స్‌ డే హార్ట్స్‌, లవ్‌లాక్‌డ్‌, పింక్‌హార్ట్స్‌, బ్లూహార్ట్స్‌, క్యూటెస్ట్‌ కపూల్‌, లవ్‌ ఈజే ఏ సీజన్‌, బీ మై వాలెంటైన్‌, కంప్లీట్‌ మీ ఇలా వివిధ రకాల కార్డులు యువత మనసు దోచుకుంటున్నాయి. ఈసారి సండే నాడు వాలెంటైన్స్‌ డే రావడంతో ఇక ఖుషీ ఖుషీ యే.

English summary