కట్టప్ప బాహుబలిని చంపిన రహస్యం ఆ ముగ్గురికే తెలుసట

Only 3 people knows that why Kattappa kills Baahubali

03:21 PM ON 25th August, 2016 By Mirchi Vilas

Only 3 people knows that why Kattappa kills Baahubali

బాహుబలి సంచలన విజయంతో, ఇప్పుడు బాహుబలి 2 చిత్రం కోసం భారత సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కంటే, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే రహస్యం తెలిసిపోతుందని, అందుకే ఇక వెయిట్ చేసి, టెన్షన్ భరించలేమని ప్రపంచ సినీ అభిమానులు తహతహలాడుతున్నారు. తనకొక్కడికి మాత్రమే తెలిసిన ఈ రహస్యాన్ని బాహుబలి 2 సినిమాలో రాజమౌళి చెప్పబోతున్నాడు. అంతవరకూ బానే వున్నా, ఇప్పుడు ఈ రహస్యం రాజమౌళితో పాటు మరో ముగ్గురికి తెలిసిపోయిందని టాలీవుడ్ లో గుసగుసలాడుకుంటున్నారు. ఆ ముగ్గరు ఎవరో కాదు..

కట్టప్పగా నటించిన సత్యరాజ్, బాహుబలిగా నటించిన ప్రభాస్, ఈ బాహుబలిని కట్టప్ప చంపే సన్నివేశాల చిత్రీకరణకు ఏర్పాట్లు చేసిన నిర్మాత శోభు యార్లగడ్డ. ప్రస్తుతం ఈ ప్రశ్నపై వందల కోట్ల వ్యాపారం ఆధారపడివుంది. అందుకే ఈ రహస్యం ఎట్టిపరిస్థితుల్లో బయటకు పొక్కకుండా రాజమౌళి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాడట. అయితే, ఈ సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు యూనిట్ సభ్యులకు తెలిసిపోతుందని భావించిన దర్శకధీరుడు. కేవలం ముగ్గురి వ్యక్తుల మధ్యే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించాడట. ఈ సన్నివేశం చిత్రీకరణ ప్రాంతంలో కట్టప్ప, బాహుబలి, శోభు యార్లగడ్డ మినహా ఎవ్వరూ లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాడు.

అంతేకాదు, చిత్రీకరించే సీన్ బాహుబలిని కట్టప్ప చంపే సీన్ అని కూడా తెలియకుండా బాహుబలిని, కట్టప్పను కూడా కొంత అయోమయంలో రాజమౌళి పడేశాడట. బాహుబలి 2 సినిమాకు సంబంధించిన విషయాలు లీక్ కాకుండా జక్కన్న ఎంతటి గట్టి నిర్ణయాలు తీసుకుంటున్నాడో చూస్తే ఆశ్చర్య పడక తప్పదు. మరి ఈ సీన్ తీసిన కెమెరా మెన్ కి కూడా విషయం తెలీదంటే ఈ రహస్యం నిజం గానే రహస్యమే. ఇదే కాదు బాహుబలి -2 మరికొన్ని సందేహాలను కూడా నివృత్తి చేస్తుందని చెప్పవచ్చని మరో వాదనా వినిపిస్తోంది. ముందు భాగంలో చోటుచేసుకున్న సందేహాలన్నీ పటాపంచలు చేసేలా పగడ్బంధీ వ్యూహం రచించాడట జక్కన్న. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే బాహుబలి -2 చూసాక, మరోసారి బాహుబలి -1 పై కూడా ఫోకస్ పెడతారని భావిస్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

English summary

Only 3 people knows that why Kattappa kills Baahubali