రూ. 500 నోటుకి 4 వందలే ఇస్తున్నారు... దళారుల దోపిడీ

Only 400 is giving for 500 note

10:23 AM ON 10th November, 2016 By Mirchi Vilas

Only 400 is giving for 500 note

రూ. 500, 1000 నోట్లు రద్దు చేస్తూ ప్రధాని మోడీ ప్రకటించిన గంటలోపే చెన్నై, కోయంబత్తూరు, మదురై, ఈరోడ్ తదితర నగరాలలో కందువడ్డీ వ్యాపారులు ప్రత్యక్షమయ్యారు. జనం నుండి పెద్దనోట్లను తీసుకుని తక్కువ మొత్తంలో చిల్లర ఇస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో ప్రజలు కూడా దళారులనే ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రమంతటా పలు నగరాలలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లను ఎలా మార్చుకోవాలా అని భయాందోళనలో వున్నారు. వారి అవసరాన్ని ఆసరాగా చేసుకొని దళారీలు వెయ్యి రూపాయల నోటుకు 900లు, ఐదొందల నోటుకు రూ.400లు చొప్పున చెల్లిస్తున్నారు.

తమ వద్ద ఉన్న వెయ్యి, ఐదొందల నోట్లను వదలించుకుంటే చాలునని దళారీలకు వాటిని అప్పగించి వంద రూపాయల నోట్లను తీసుకున్నారు. ఈ పెద్ద నోట్ల కొనుగోలు కమిషన్ వ్యాపారం తమిళనాడు అంతటా జోరుగా సాగుతోంది. ఇక ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో కొనుగోళ్లు చేసి రూ 500 నోట్లు ఇస్తుంటే, నోటుకి రూ 50కటింగ్ పెట్టి మరీ డబ్బులు అదనంగా గుంజుతున్నట్లు పలువురు వాపోతున్నారు. గత్యంతరం లేక అందుకు పలువురు సిద్ధపడుతున్నారు.

English summary

Only 400 is giving for 500 note