వినడానికి షాకింగ్ గా ఉన్నా.. ఆ గ్రామంలో ఉండేది ఒక్కడే!

Only one person is living in China village

03:20 PM ON 14th September, 2016 By Mirchi Vilas

Only one person is living in China village

ఒంటరి జీవితం నరకప్రాయం అన్నారు కదా. పదిమందితో సరదాగా గడిపేవారు ఒంటరి బతుకుని అస్సలు తట్టుకేలేరు. ఇక ఒక్క రాత్రైనా సరే ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే కొందరు భయపడుతూ, బిక్కుబిక్కుమంటూ గడుపుతారు. కొందరు ఒకటి రెండు రోజులు ఎదో గడిపేసినా, ఆ తర్వాత అస్సలు ఉండలేరు. మరి రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి ఒంటరిగా ఉండాలంటే, ఇంకేమైనా ఉందా? అసలు ఆ విషయం ఊహించుకోడానికే భయపడిపోతుంటారు. కానీ చైనాలోని ఆ ఊళ్ళో మాత్రం ఒకే ఒక్కడు పదేళ్ళుగా ఒంటరిగా బతికేస్తున్నాడు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వివరాల్లోకి వెళ్తే..

1/8 Pages

చైనాలోని 'క్సెన్షాన్సె'(Xuenshanshe) గ్రామ జనాభా సంఖ్య ఒకే ఒక్కటి! అక్కడ నివసించే వ్యక్తి పేరు 'లూ షెంగ్జీయా'. స్థానిక ఫారెస్ట్ ప్రొటెక్షన్ స్టేషన్ వాచ్ మెన్ ఉద్యోగి. పదేళ్ళ క్రితం వరకు ఈ గ్రామంలో ఇరవైకి పైగా కుటుంబాలు నివసించేవి. బతుకుతెరువు కోసం అందరూ వలస వెళ్ళిపోయారు. చివరగా 'లూ' కుటుంబం మాత్రమే మిగిలింది. పుట్టిన గడ్డను వదిలి వెళ్ళటం ఇష్టం లేక, అక్కడే ఉండాలని నిర్ణయించుకుందా కుటుంబం. తర్వాత తల్లి, సోదరుడు మరణించడంతో లూ ఆ గ్రామంలో ఒంటరిగా మిగిలిపోయాడు.

English summary

Only one person is living in China village. Only one person is living in China Xuenshanshe village. Because some people gone away from that village.