ఏ రోగమైనా సరే ఒక్కటే ట్యాబ్లెట్ ఒకటి వేసుకుంటే నెలంతా పనిచేస్తుంది!

Only one tablet for any disease

12:32 PM ON 25th November, 2016 By Mirchi Vilas

Only one tablet for any disease

మనిషికి ఏదో ఒక జబ్బు రావడం సహజమే. అది జలుబు నుంచి మొదలు క్యాన్సర్ లాంటి మహామ్మారి వరకు ఎన్నో కావచ్చు. వాస్తవానికి నిత్యం రోగాలతో సతమతం అయ్యే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉందన్నది అందరికీ ఎరుకే. హాస్పిటల్స్ అన్నీ ఫుల్లుగా కనిపిస్తుంటాయి కూడా. ఒకే వ్యక్తి ఒక్క రోజు జ్వరమని.. దగ్గని.. గుండె జబ్బులు.. షుగర్ వ్యాధి అని ఇలా ఎంత లేదన్నా రోజుకు కనీసం ఓ 5 నుండి 6 మందుబిల్లలు మింగాల్సిందే. అలా నిత్యం మెడిసిన్ వాడుతున్న వారి సంఖ్య 50% నికి పైనే.

మరి అలాంటి వారి కష్టాలను తీర్చేందుకు కొత్త ట్యాబ్లెట్ వస్తే.. ఒక్క మందు బిళ్ల నెలంతా పని చేస్తే... ఇక అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు కదా. అయితే, అలాంటి ఓ మందును తీసుకు వచ్చే పనిలో శాస్త్రవేత్త సి.జియోవానీ ట్రావెర్సో తదితర వైద్యశాస్త్రవేత్తలున్నారు. ఆ వివరాల్లోకి వెళదాం...

1/5 Pages

బిపి, షుగర్, ఇలా పలు రోగాలకు ఎన్నో రకాల మందు బిళ్లలను కడుపులోకి తోయడం చూస్తున్నాం. మాత్రలు ఇన్ని మింగలేకపోతున్నాం అనేవాళ్లున్నారు. అందుకే కేవలం నెలకు ఒక్క మాత్రతోనే రోగాన్ని నయం చేసుకోవచ్చని శాస్తవేత్తలు చెపుతున్నారు. ఒక్కసారి వేసుకుంటే మళ్లీ నెల రోజుల పాటు వేసుకోవాల్సిన అవసరం లేని కొత్త క్యాప్సూల్ ను తయారీలో మసాచూసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బ్రైగమ్ ఉమెన్స్ హాస్పిటల్ కు చెందిన వైద్య శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు.

English summary

Only one tablet for any disease