సర్దార్ కి పాస్ లున్నవారే  రావాలి

Only passes holders can only allowed to Sardar Gabbar Singh audio launch

06:02 PM ON 19th March, 2016 By Mirchi Vilas

Only passes holders can only allowed to Sardar Gabbar Singh audio launch

మొత్తానికి చేయాలా వద్దా అనుకున్న సర్దార్ ఆడియో ఫంక్షన్ కన్ఫర్మ్ అయింది. అయితే ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ ఆడియో విడుదల కార్యక్రమానికి పాస్‌లు ఉన్నవారు మాత్రమే రావాలట. పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌ స్వయంగా వెల్లడిస్తూ, ఈమేరకు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "తొలుత ఆడియో ఫంక్షన్‌ చేయాలా వద్దా? అనే సమస్యలో ఉన్నాం. నోవాటెల్‌ హోటల్‌లో ఫంక్షన్‌ చేద్దామంటే పోలీసులు భద్రత సమస్య గురించి చెప్పారు. నిర్మాత శరత్‌ మరార్‌ స్వయంగా వెళ్లి పోలీసులను కలిసి చెప్పారు. హోటల్‌లో విదేశీ అతిథులున్నందున పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు" అని వివరించారు. ఇక ఈ కార్యక్రమానికి చిరంజీవిని ఆహ్వానించినట్లు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

ఆడియో విడుదల కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ డీజీపీ అనురాగ్‌ శర్మ, సీపీ సీవీ ఆనంద్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సహకరించిన తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు కూడా పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి ఈ ఆదివారం సర్దార్ సందడితో టివిల ముందు అభిమానులు అతుక్కుపోవడం ఖాయం.. మరి పవన్ సినిమా అంటే అభిమానులకు పండగే కదా...

English summary

Power Star Pawan Kalyan said that only passes holders can only allowed to Sardar Gabbar Singh audio launch.