మార్చ్ లో 'ఊపిరి' ఆడియో

Oopiri audio in March

12:00 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

Oopiri audio in March

అక్కినేని నాగార్జున-కార్తీ కలిసి నటిస్తున్న చిత్రం 'ఊపిరి'. ఈ చిత్రంలో శ్రియ, తమన్నా హీరోయిన్లు గా నటిస్తున్నారు. 'బృందావనం' ఫేమ్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రయోగాత్మక కామెడీ ఎంటర్టైనర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. పీవీపి సంస్థ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున పూర్తిగా వీల్ ఛైర్ కి పరిమితమయ్యే ఓ ప్రయోగాత్మక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ చిత్రాన్ని మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర నిర్మాతలు పీవీపీ సంస్థ ఇటీవలే ప్రకటించారు.

తాజాగా ఈ చిత్రం ఆడియో రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. ఫిబ్రవరి 28న ఈ చిత్రం ఆడియో ని అంగరంగ వైభవంగా విడుదల చేయబోతున్నారు. ఫ్రెంచ్ లో సూపర్ హిట్ అయిన ‘ది ఇన్‌టచబుల్స్‌’కు ఊపిరి రీమేక్.

English summary

Nagarjuna-Karthi's multistarrer movie Oopiri audio on March 28th. Shriya and Tamanna was acting in female lead roles. Vamsi Paidipalli was directing this movie.