'ఊపిరి' నిర్మాతలు మోసం చేసారు:రాజా రవీంద్ర

Oopiri Movie Producers Cheated Me Says Raja Ravindra

09:41 AM ON 4th April, 2016 By Mirchi Vilas

Oopiri Movie Producers Cheated Me Says Raja Ravindra

ఈ మండు వేసవిలో ‘ఊపిరి’ ప్రమోషన్‌తో ఆ సినిమా యూనిట్‌ అభిమానులను ఊపిరి తీసుకోనివ్వడంలేదని అంటుంటే, మరోపక్క వరుస ప్రశంసలు లభిస్తుంటే, ఇంకోపక్క నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి. ఈ సినిమా కారణంగా ఓ నటుడు నష్టపోయాడన్న వార్త ఫిలింనగర్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఆ నటుడు ఎవరో కాదు రాజారవీంద్ర. ఇతగాడు ‘ఊపిరి’ టైటిల్‌ను ఎప్పుడో రిజిస్టర్‌ చేసి పెట్టుకున్నాడు. ఈ సినిమా దర్శకనిర్మాతలకు తమ సినిమాకు ‘ఊపిరి’ అన్న పేరు డిసైడ్‌ అయిన తరువాత రాజారవీంద్ర ఆ పేరును రిజిస్టర్‌ చేయించాడని తెలిసిందట! ‘ఊపిరి’ టైటిల్‌ తమకు ఇచ్చినట్టయితే సినిమాలో ఓ మంచి పాత్ర ఇస్తామని అతగాడికి ఆశ పెట్టారట! దానితో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఉదారంగా రాజారవీంద్ర తన టైటిల్‌ వీరికి ఇచ్చేశాడు. దర్శకనిర్మాతలు రాజారవీంద్రకు ప్రామిస్‌ చేసినట్టుగానే ఓ పోలీసాఫీసరు పాత్ర ఇచ్చారు. కానీ చివరికి ఈ పాత్ర కనిపించేది కొద్దిసేపే! అంతే కాకుండా ఒకే ఒక్క డైలాగు ఉండడంతో రాజారవీంద్ర షాక్‌ తిన్నాడని సమాచారం! తను మోసపోయిన విధానం బయటకి చెప్పుకోలేక సన్నిహితుల వద్ద తన బాధను వ్యక్తం చేస్తున్నాడట. దర్శకనిర్మాతలు తనను మోసం చేసారని వాపోతున్నాడట.

ఇవి కుడా చదవండి :

పూరిజగన్నాథుని ఆలయం గురించి ఆసక్తికరమైన విషయాలు

‘అన్నమయ్య పాటకి పట్టాభిషేకం

ఇండియాలో భారతీయులకు ఎంట్రీ లేని ప్రదేశాలు

English summary

Actor Raja Ravindra Says That Akkineni Nagarjuna's recent Super Hit Film Oopiri Producers and Director Cheated him. He says that he was registered Oopiri Title long ago and Oopiri team asked him to give that title and they said that they will give him good role in Oopiri Movie, but they have not given a good role and they given a very small role in the movie.