ఊపిరి తమిళ వెర్షన్ ఆడియో విడుదల

Oopiri Movie Tamil Audio Release

03:11 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Oopiri Movie Tamil Audio Release

'సోగ్గాడే చిన్ని నాయన' లో బంగార్రాజు గా అలరించిన  అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన  ‘ఊపిరి’ సినిమా తమిళ ఆడియో విడుదల వేడుకలను శుక్రవారం చెన్నైలో ఘనంగా  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతోపాటు నటుడు సూర్య కూడా పాల్గొన్న ఈ కార్యక్రమం  గురించి నాగార్జున తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన  ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.  సూర్య, కార్తీ తనపై అమితమైన ప్రేమను చూపించారంటూ నాగార్జున ట్వీట్‌ చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గోపి సుందర్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. మార్చి 1న తెలుగు ఆడియోను విడుదల చేయనున్న ‘వూపిరి’ చిత్రాన్ని ‘ఇన్‌ టచ్‌బుల్స్‌’ అనే ఫ్రెంచ్‌ చిత్రం ఆధారంగా తెరకెక్కించారు.

1/8 Pages

ఊపిరి టీజర్

ఊపిరి టీజర్ ను ఇప్పటి వరకు 9 లక్షలకు పైగా వ్యూలు వచ్చాయి.

English summary

Akkineni Nagarjuna and Karthi together acted film Oopiri movie Tamil audio was released yesterday in Chennai.Surya attended as guests to this Audio function and Nagarjuna posted a photo on his twitter.The Name Of Oopiri in Tamil was "Thoza"