పొంతనలేని స్టేట్మెంట్స్ తో కన్ఫ్యూజ్ చేస్తున్న నాగ్, కార్తి

Oopiri Movie Team Press meet

01:04 PM ON 22nd March, 2016 By Mirchi Vilas

Oopiri Movie Team Press meet

నాగార్జున, కార్తీ కాంబినేష‌న్లో రూపొందిన మల్టీ స్టారర్ చిత్రం ఊపిరి. వంశీ పైడిప‌ల్లి దర్శకత్వం వహించగా, పి.వి.పి నిర్మాత గా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని తెలుగు తమిళం లో ఈనెల 25న రిలీజ్ చేస్తున్నారు. సోమవారం ఈ సంద‌ర్భంగా  హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

మీడియా సమావేశం లో 'ఊపిరి' సినిమా విషయంలో నాగార్జున, కార్తి పొంతన లేకుండా మాట్లాడటం వల్ల చర్చనీయాంశం అయింది. నాగార్జున ఇది ఓ ఫ్రెంచి చిత్రం రీమేక్ అని చెప్పాడు. తెలుగు ప్రేక్ష‌కులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో అలా ఉంటుంది ఈ చిత్రం అన్నారు . మొదటిసారి తమిళంలో డబ్బింగ్ చెప్పానని,త‌మిళ‌నాడులో న‌న్ను ఎంతో చక్కగా రిసీవ్ చేసుకున్నారని నాగార్జున చెప్పుకొచ్చారు. ఈ చిత్రం ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన ట్రూ స్టోరి అని చెప్పి ఇంకా వాళ్లు బ‌తికే ఉన్నారని అన్నారు. కొన్నిసోల్ ఉన్న కథలు ట‌చ్ చేస్తాయి, అటువంటి కథే ఊపిరి అని నేను ఫ్రెంచ్ మూవీ చూసినప్పుడు తెలుగులో ఎవరైనా ఈ సినిమా చేసి ఈరోల్ నాకు ఇస్తే బాగుంటుండనుకున్నాను. నా కోరిక దేవుడు విన్నాడేమో ఈ క‌థ నా ద‌గ్గ‌ర‌కి వ‌చ్చింది అని టాలీవుడ్ మన్మధుడు అన్నాడు. ఊపిరి క‌థలోకి అలాగే కార్తీ వ‌చ్చాడు అలాగే  హీరోయిన్ గా ఎవ‌ర్నో అనుకుంటే త‌మ‌న్నా వ‌చ్చిందని, క‌థే మ‌మ్మ‌ల్ని ఎంచుకుంది అంటూ నాగార్జున మాట్లాడారు. ఆ  తర్వాత కార్తి మైక్ తీసుకుని ఈ చిత్రం రీమేక్ కాదు, అలా అనొద్దు అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

1/8 Pages

పొంతన లేకుండా

మీడియా సమావేశం లో 'ఊపిరి' సినిమా విషయంలో నాగార్జున, కార్తి పొంతన లేకుండా మాట్లాడటం వల్ల చర్చనీయాంశం అయింది

English summary

Here watch the press meet on the release date of Oopiri Movie. Oopiri is a multi-starer featuring Nagarjuna and Karthi. Tamannaah is playing the love interest of Karthi in the movie.