ఇద్దరు స్నేహితుల ఊపిరి

Oopiri To Release On March

10:04 AM ON 16th February, 2016 By Mirchi Vilas

Oopiri To Release On March

‘మనం’, ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రాలతో వరుసగా రెండు విజయాల్ని అందుకొన్న నాగార్జున ఇప్పుడు హ్యాట్రిక్‌పై దృష్టిపెట్టాడు. నాగార్జున, కార్తి హీరోలుగా నటించిన ‘ఊపిరి’ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా వేసింది. వంశీ పైడిపల్లి దర్శక త్వం వచ్చిన ఈ చిత్రాన్ని పొట్లూరి వి.ప్రసాద్‌ నిర్మిస్తున్నాడు. గోపీసుందర్‌ సంగీతం అందించాడు. ఈ చిత్రం చిత్రీకరణ పూర్తవ్వడంతో వచ్చే నెల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ‘‘తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరిపిన ఈ చిత్రం లోని కీలక సన్నివేశాల్ని ఫ్రాన్స్‌, బల్గేరియా, స్లోవేనియాల్లో తెరకెక్కించామని నాగార్జున కెరీర్‌లో వైవిధ్యభరితమైన చిత్రంగా మిగిలిపోతుందని నిర్మాత చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇద్దరు స్నేహితుల కథ ఇది. భావోద్వేగాలకు పెద్ద పీట వేశాం" అని వివరించాడు. ఊపిరి నిజంగా ఊపిరి పోస్తుందా మరి.

English summary

qPresently King akkineni Nagarjuna was enjoying the success of his latest super hit film Soggade Chinni Nayana movie . Nag's last two movies Manam and Soggade chinni nayana was become super hit at the box office and his latest movie "Oopiri" was going to be released on march.In this movie along with Nagarjuna , Tamil hero Karthi and Heroine Tamanna was acted in lead roles in the movie and was directed by Vamsi Paidipalli