అక్కడ బహిరంగ పెళ్లిళ్లపై నిషేధం..

Open marriages are banned in Turkey

02:54 PM ON 3rd September, 2016 By Mirchi Vilas

Open marriages are banned in Turkey

ఆకాశమంత పందిరి వేసి... పెళ్లి ఘనంగా చేసేవారని విన్నాం. ఆరోజుల్లో కళ్యాణ మండపాలు స్టార్ హోటళ్లు కాకుండా ఇల్లే పెళ్లి వేదికగా అయ్యేది. చుట్టుపక్కల పదిమంది కూడా సహకరించేవారు. ఇప్పుడు అన్నీ ఆర్భాటాలే. ఇక పెళ్లి వారింట విరిసే సందడి అంతా ఇంతా కాదు. ఇంటి నిండా బంధువులు, మేళతాళాల మధ్య వూరేగింపులతో ఆర్భాటంగా ఉంటుంది. అయితే పెళ్లి వేడుకల్లో ఈ హంగులు, ఆర్భాటాలకు టర్కీ ప్రభుత్వం చెక్ పెట్టేసింది. భద్రతా కారణాల దృష్ట్యా బహిరంగ వివాహాలపై నిషేధం విధించింది. ఆగస్టు 20న టర్కీలోని గజియాన్ టెప్ లో ఓ వివాహ వేడుకపై బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే.

ఈ ఘటనలో 56 మంది మృతిచెందగా.. మరో 100 మంది వరకు గాయపడ్డారు. దీంతో బహిరంగ వివాహాలు, నిశ్చితార్థపు వేడుకలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. అంతేగాక, ఇంట్లో వివాహాలు చేసుకునే వారు కూడా ముందస్తుగానే సంబంధిత అధికారులకు వివరాలు అందించాలని సూచించింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు చేపట్టే అవకాశముంటుందని పేర్కొంది. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టరీత్యా వారిపై చర్యలు చేపడుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: మీ దగ్గర ఈ కెమికల్స్ ఉంటే మీ పాత ఫోన్ నుంచి బంగారం తియ్యొచ్చు!

ఇది కూడా చదవండి: ఆడవాళ్ళకు ఎక్కువగా వచ్చే కల ఏమిటో తెలుసా?

ఇది కూడా చదవండి: 'జనతా' పై క్లారిటీ ఇచ్చిన కొరటాల శివ

English summary

Open marriages are banned in Turkey. Open marriages are banned in Turkey.