ప్రాంతీయ భాషల్లోనూ ఓపెరా మినీ

Opera Mini Browser In Regional Languages

11:17 AM ON 28th January, 2016 By Mirchi Vilas

Opera Mini Browser In Regional Languages

ప్రముఖ బ్రౌజింగ్ సంస్థ ఓపెరా ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఓపెరా మినీ బ్రౌజర్ కు మరిన్ని నూతన ఫీచర్లను జత చేసి తన యాప్‌ను సరికొత్త అప్‌డేట్‌ తో అందిస్తోంది. ఈ అప్‌డేట్‌ను యూజర్లు ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొత్త వెర్షన్‌లో డౌన్‌లోడ్ మేనేజర్‌ను మరింత సమర్థవంతంగా పనిచేసేలా తీర్చిదిద్దారు. దీని ద్వారా యూజర్ ఇంతకు ముందు కన్నా వేగంగా, సులభంగా ఆయా ఫైల్స్‌ను ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా తెలుగు, తమిళం, ఉర్దూ, హిందీ, మళయాళం వంటి 13 రకాల భారతీయ భాషలకు ఇందులో సపోర్ట్‌ను అందిస్తున్నారు. దీంతోపాటు క్యూఆర్ కోడ్ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. ఇది క్యూ ఆర్ కోడ్‌లను కొత్తగా క్రియేట్ చేసుకునేందుకు, ఉన్నవాటిని రీడ్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. డివైస్‌లో ఇంటర్నెట్ డేటాను ఎంత మొత్తంలో ఉపయోగిస్తున్నారో తెలుసుకోవచ్చు. ఇవే కాకుండా ఇతర ఇంటర్నెట్ బ్రౌజర్లలో ఉండే దాదాపు అన్ని రకాల ఫీచర్లను ఇందులో అందిస్తున్నారు.

English summary

Opera web browser releases a new update with 13 Indian regional languages anjd Improved Download Manager.13 Indian languages - Assamese, Bengali, Gujarati, Hindi, Kannada, Kashmiri, Malayalam, Marathi, Oriya, Punjabi, Tamil, Telugu, and Urdu