ఈవ్ టీజర్ల దుమ్ము దులిపిన పోలీసులు(వీడియో)

Operation Romeo returns in Haryana

12:03 PM ON 6th September, 2016 By Mirchi Vilas

Operation Romeo returns in Haryana

సరిగ్గా తలచుకోవాలే గానీ, నేరస్తులను, ఆకతాయిలను ఓ చూపు చూడడం పోలీసులకు పెద్ద పనేం కాదు. అయితే వారికుండే వత్తిళ్లు, కొందరు అధికారుల ప్రవర్తన తదితర కారణాల వలన నిర్లిప్తంగా ఉంటున్న పోలీసులు కొరడా ఝళిపిస్తే ఎలా ఉంటుందో ఈ ఘటన మరోసారి నిరూపిస్తోంది. హర్యానాలోని గురుగ్రామ్ లో పోలీసులు ఈవ్ టీజర్ల భరతం పట్టారు. 'ఆపరేషన్ రోమియో రిటర్న్స్' పేరిట చేపట్టిన ఈ కార్యక్రమంలో.. రెండు గంటల్లోగా, ఎంజీ రోడ్డు ప్రాంతంలో మాటు వేసి121 మందిని అరెస్టు చేశారు. గురుగ్రామ్ లో అమ్మాయిలను వేధిస్తున్న పోకిరీలపై కేసులు పెడతామని, అవసరమైతే జైలుకు పంపుతామని ఏసీపీ ధర్మ యాదవ్ ప్రకటించడం విశేషం.

సిటీలో రోజురోజుకూ వీరి ఆగడాలు పెరిగిపోతున్నాయని చెప్పిన ఏసీపీ, గత నెల 27న కూడా ఇదే ప్రాంతంలో 50 మందిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. కాగా.. శనివారం రాత్రి జరిపిన ఆపరేషన్ రోమియో రిటర్న్స్ లో సుమారు 20 మంది పోలీసులు సివిల్ డ్రెస్సుల్లో పాల్గొన్నారు. పోకిరీలను పట్టుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. ఇదే ఊపు కొనసాగితే, ఆకతాయిలు, నేరస్థులు మూట ముళ్ళు సర్దుకుంటారు. అయితే ఈలోగా రాజకీయ జోక్యం వస్తే, మాత్రం పరిస్థితి మళ్ళీ మామూలే.

ఇది కూడా చదవండి: షాకింగ్: దానికి ఓకే చెప్పిన నిత్యామీనన్!

ఇది కూడా చదవండి: రూపాయికే 1జిబి... రిలయన్స్ జియోకి జర్క్ ఇచ్చిన బీఎస్ ఎన్ ఎల్.

ఇది కూడా చదవండి: ఓ ఇంటివాడైన మనం విక్రమ్ కె కుమార్

English summary

Operation Romeo returns in Haryana