ట్రీ మాన్ కుర్రాడండీ బాబూ !

Operation Success For Bangladesh Tree Man

11:20 AM ON 11th August, 2016 By Mirchi Vilas

Operation Success For Bangladesh Tree Man

ఈలోకంలో మనుషులు అనేకరకాలుగా వుంటారు. ఇక కొంతమంది అయితే, వింతగా పుడతారు. కొండై కొన్ని అవయవాలు వింతను గొల్పుతాయి. సరిగ్గా అలాంటిదే ఇది. ఈ కుర్రాడి పేరు అబుల్ మాజందార్.. కానీ ఈ బాంగ్లాదేశ్ కుర్రాడు ట్రీ మాన్ అంటూ ప్రసిద్ధికెక్కాడు. ఇతగాడి చేతి వేళ్ళు మర్రిచెట్టుకి దిగిన ఊడల్లా మారిపోయి ఉండడమే ఇందుకు కారణం. ఈ వేళ్ళతో తను ఇన్నేళ్లూ ఎలాగోలా ఇబ్బంది పడుతూ వచ్చాడు.

తన వేళ్ళు ఎప్పటికైనా మామూలు స్థితికి వస్తాయన్న అబుల్ ఆశలు ఎట్టకేలకు తీరిపోయినట్టే. ఢాకా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ చేసిన కృషి వల్ల ఈ ట్రీ మాన్ అదృష్టవంతుడయ్యాడు.

ఏడు నెలల పాటు పది విడతలుగా జరిగిన ఆపరేషన్లు.. చివరకు సక్సెస్ నిచ్చేశాయి. చేతికున్న బ్యాండేజ్ తీసి తన వేళ్ళను చూసి తనే నమ్మలేక పోయాడు అబుల్. వైద్య రంగంలో దీన్నొక మైలురాయిగా పేర్కొంటూ బాంగ్లాదేశ్ మీడియాలో ఈ కుర్రాడి గురించి వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:మెగా అన్నయ్యకు 9 రోజుల బర్త్ డే సెలబ్రేషన్స్

ఇవి కూడా చదవండి:చరిత్ర సృష్టించనున్న డాక్టర్లు.. ఒకరి తల మరొకరికి అతికించబోతున్నారు!

English summary

A Boy named Abdul Mazamdar was suffering with some disorder and his hand fingers nails was grown like tree. Bangladesh People used call him a Tree Man and now Dhaka Medical College hospital was done operation and removed that tree like nails from his hands.