భారతలోకి ఒప్పో ఎఫ్‌1

Oppo F1 Launched in India

11:00 AM ON 29th January, 2016 By Mirchi Vilas

Oppo F1 Launched in India

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ ఒప్పో భారత మార్కెట్లోకి సరికొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఒప్పో ఎఫ్‌1 పేరిట విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ వెలుతురులోనూ డబుల్‌ ఫ్లాష్‌ ద్వారా ఫోటోలు తీసుకునే సదుపాయం ఉంది. యువతకు నచ్చే పలు ఆకర్షణీయమైన ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. దీని ధర రూ.15,990గా నిర్ణయించారు. ఫిబ్రవరి నుంచి ఈ ఫోన్‌ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్‌లో మరో కొత్త ఫోన్‌ ఒప్పో ఎఫ్‌1 ప్లస్‌ను విడుదల చేస్తామని ఈ కంపెనీ వెల్లడించింది.

ఒప్పో ఎఫ్ 1 ఫీచర్లు ఇవీ..

13 మెగా పిక్సల్‌ రేర్‌ బ్యాక్‌ కెమేరా, 8 మెగా పిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా, 2500ఎఏహెచ్‌ లై-పో బ్యాటరీ, 4జీ నెట్‌వర్క్‌, 16 జీబీ అంతర్గత మెమొరీ(128జీబీ వరకూ విస్తరించుకునే సదుపాయం), 5 అంగుళాల హెచ్‌డీ తెర, గొరిల్లా గ్లాస్‌, 3 జీబీ ర్యామ్‌, డ్యుయల్ సిమ్ (మైక్రో + నానో), ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 4 కోటింగ్, 1.7 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్, అడ్రినో 405 జీపీయూ

English summary

Oppo Company launched a new smart phone in India Called Oppo F1. The price of this smart phone was around Rs. 26,990 and it comes with the key features like dual-SIM,5-inch HD IPS display,Gorilla Glass 4 ,octa-core Qualcomm Snapdragon Processor,3GB LPDDR3 RAM 2500mAh Li-Po battery,16GB of inbuilt storage