15 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్

Oppo new smartphone charges in just 15 minutes

06:51 PM ON 26th February, 2016 By Mirchi Vilas

Oppo new smartphone charges in just 15 minutes

స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు అందరి చేతిలోనూ కామన్ గా ఉండే గాడ్జెట్. అయితే ఈ స్మార్ట్ ఫోన్ తో వచ్చిన పెద్ద చిక్కు ఏమిటంటే ఈజీగా చార్జింగ్ అయిపోతూ ఉంటుంది. గేమ్ ఆడినా.. వీడియో చూసినా.. ఏమి చేసినా అంతే.. దీంతో బ్యాటరీ బ్యాకప్ పెద్ద ట్రబుల్ అయిపోయింది జనానికి. ఇలాంటి వారి కోసమే చైనాకు చెందిన మొబైల్స్ తయారీ సంస్థ ఒప్పో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను రూపొందించింది. సూపర్ వీఓఓసీ బ్యాటరీ టెక్నాలజీతో కూడిన 2500 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఓ స్మార్ట్‌ఫోన్‌ 15 నిమిషాల్లోనే 0 నుంచి 100 శాతం చార్జింగ్ అయిపోతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఒప్పో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016లో ప్రదర్శించింది. క్వాల్‌కామ్ కంపెనీకి చెందిన క్విక్ చార్జింగ్ టెక్నాలజీ ఇప్పటికే అందుబాటులో ఉండగా దాని కన్నా ఒప్పో రూపొందించిన ఈ సూపర్ వీఓఓసీ సాంకేతికత బ్యాటరీని వేగంగా చార్జింగ్ చేయగలుగుతుంది. మైక్రోయూఎస్‌బీ, యూఎస్‌బీ టైప్-సి పోర్టుల ద్వారా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు యూజర్ ఫోన్ వాడుతూనే చార్జింగ్ చేసుకోవచ్చని, ఇది అత్యంత సురక్షితమని ఒప్పో చెబుతోంది. అతి త్వరలోనే ఈ పరిజ్ఞానాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తామంటోంది ఒప్పో.

English summary

Oppo company launched a new quick charging technology yesterday at MWC 2016, called Super VOOC Flash Charge, that is capable of charging most of their phones in under 15 minutes.