'బ్రహ్మీ' సీన్‌ రివర్స్‌!!

Opportunities reduced for Brahmanandam

09:23 AM ON 20th January, 2016 By Mirchi Vilas

Opportunities reduced for Brahmanandam

బ్రహ్మానందం తెలుగులో ప్రముఖ హాస్యనటుడు. గత కొద్ది నెలల వరకూ బ్రహ్మీ లేని సినిమా లేదు. పెద్ద హీరోలు కూడా బ్రహ్మీ కాల్‌ షీట్స్‌ కోసం ఎదురుచూసేవారు. అయితే ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. బ్రహ్మానందం లేని సినిమాలు రావడమే కాకుండా హిట్‌ అవుతూ రికార్డ్‌లు కూడా సృష్టిస్తున్నాయి. గత సంవత్సరంలో హిట్టయిన సినిమాలు శ్రీమంతుడు, బాహుబలి, రుద్రమదేవి, భలేభలే మగాడివోయ్‌, టెంపర్‌, కుమారి 21ఎఫ్‌ లలో బ్రహ్మీ కనిపించలేదు. దీనికి కారణం కొత్త కమీడియన్లు సప్తగిరి, షకలక శంకర్‌ జబర్‌దస్త్‌ టీం ప్రేక్షకులను అలరించడం వల్ల నిర్మాతలు వారికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. పైగా వారికి రెమ్యూనరేషన్ కూడా తక్కువ.

బ్రహ్మీ కి అయితే హీరోలో సగం పారితోషికం ఇవ్వాలి. అయితే మరో పక్క దీనికి ప్రదాన కారణం బ్రహ్మీ అహంకారమే అని ఇండస్ట్రీలో కొంతమంది అనుకుంటున్నారు. ఆయన లేనిదే సినిమా లేదనే అహంకారమే ఆయనకు అవకాశాలు లేకుండా చేసిందని అనుకుంటున్నారు.

English summary

Opportunities reduced for comedian Brahmanandam in movies. Sapthagiri and Shakalaka Shankar replaced his place in tollywood.