సుష్మాకు హేట్సాఫ్ చెప్పిన ప్రతిపక్ష సభ్యులు 

Opposition leaders salute to Sushma Swaraj

10:10 AM ON 10th March, 2016 By Mirchi Vilas

Opposition leaders salute to Sushma Swaraj

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖమంత్రి సుష్మా స్వరాజ్ పై విపక్ష సభ్యులు బుధవారం లోక్‌‌సభలో పొగడ్తల వర్షం కురిపించారు. ఆ శాఖను ఆమె నిర్వహిస్తున్న తీరుపట్ల హేట్సాఫ్ చెప్పారు. ప్రశ్నోత్తర సమయంలో విపక్ష పార్టీలకు చెందిన పలువురు సభ్యులు ప్రశ్నలకు బదులు సుష్మాకు వరుసగా ధన్యవాదాలు తెలపడం విశేషం. సౌదీలో బానిసలుగా ఉన్న 13 మందితో పాటు మరో 8 మందిని రక్షించినందుకు ఆప్ ఎంపీ భగ్వాంత్ మాన్ ధన్యవాదాలు తెలిపారు. పంజాబ్‌కు చెందిన వారికి సుష్మా ఎంతో సహాయం చేశారంటూ మరో ఆప్ ఎంపీ ధర్మవీర్ గాంధీ కొనియాడారు. సుష్మా స్వరాజ్ విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహిస్తున్న తీరు అద్భుతమని బీజేడీ నేత వైజయంత్ పాండా ప్రశంసించారు.

ఆర్జేడీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ కూడా ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. ఇంగ్లీష్‌లో అడిగిన ప్రశ్నలకు హిందీలో సమాధానం చెప్పడం పై ధన్యవాదాలు తెలిపారు. ఇక విపక్ష సభ్యులు సుష్మాను ఇలా పొగడ్తలతో ముంచెత్తడంపై స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పందిస్తూ, ప్రశ్నలు లేవా, కేవలం ధన్యవాదాలేనా అని చమత్కరించారు. విపక్షాల పొడగ్తలతో పొంగిపోయిన సుష్మా స్వరాజ్ అంతే వినయంగా రెండు చేతులు జోడించి వారికి కృతజ్ఞతలు తెలిపారు.

English summary

Opposition party leaders salute to Sushma Swaraj.