నచ్చిన క్వాలిటీస్ ఆ యాప్ లో ఎంటర్ చేస్తే.. అలాగే పిల్లల్ని ఇస్తుందట!

Order a Daddy app in London

11:18 AM ON 29th September, 2016 By Mirchi Vilas

Order a Daddy app in London

ఇన్నాళ్లూ మనం వస్తువులు, ఆహార పదార్ధాలు వంటి వాటికోసం ఆర్డర్లు ఇవ్వడం చూసాం.. కానీ ఇప్పుడు వేరే వాటికి ఆర్డర్ ఇస్తున్నట్టు చెప్పకతప్పదు. ఇదోరకం ఆర్డర్ అంతే 'హల్లో ప్లీజ్ ఆర్డర్ తీసుకొండి కలర్ వైట్, హైట్ కనీసం ఆరు ఫీట్లు, కళ్ల కలర్ ఆసియన్ స్టయిల్ యుద్ధంలో పనిచేసిన వారా వద్దు లెండి, ఎవరైనా స్పోర్ట్స్ పర్సనాలిటీ గానీ, సినిమా సెలబ్రిటీ గానీ చూడండి కంపల్సరీ డార్క్ బ్లాక్ హెయిర్ ఆ ఆ అంతే అని చెప్పేస్తారట'. ఇంతకీ, ఏమిటీ ఆర్డర్ అని ఆశ్చర్యపోతున్నారా? కాస్తంత ఆలోచించండి..

1/4 Pages

 లండన్ లో మన ఇండియన్ సంతతికి చెందిన ఓ ఫర్టిలిటీ డాక్టర్, ఓ వినూత్న యాప్ తయారు చేశాడు. అతడి పేరు డాక్టర్ కమల్ అహుజా. ఆయనకు ఓ సైంటిఫిక్ స్పెరమ్ బ్యాంకు ఉంది. తల్లులు కావాలనుకున్న స్త్రీల కోసం రూపొందిన ఈ యాప్ పేరు 'ఆర్డర్ ఏ డాడీ'!! 950 పౌండ్లు చెల్లించేస్తే, స్మార్ట్ ఫోన్ లోని ఈ యాప్ ద్వారా రకరకాల కేరక్టర్స్ ను తమ ఛాయిస్ ద్వారా ఎంపిక చేసుకునే ఛాన్స్ ఉంటుందట.

English summary

Order a Daddy app in London