రిపబ్లిక్ వేడుకలకు  ఒడిశా గిరిజన దంపతులు

Orissa tribal couple selects For Republic Day Celebrations

01:41 PM ON 18th January, 2016 By Mirchi Vilas

Orissa tribal couple selects For Republic Day Celebrations

డిల్లీలో జనవరి 26న జరగనున్న గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఒడిశా రాష్ట్రానికి చెందిన బొండా గిరిజన దంపతులు ఎంపికయ్యారు. ఈ తెగ ప్రజలు గణతంత్ర వేడుకలకు ఎంపికవడం ఇదే తొలిసారి కావడం విశేషం. మల్కాన్‌గిరి జిల్లా ముదులిపడ పంచాయతీ బండిగూడలోని బొండా గిరిజన తెగకు చెందిన సోమారి శీసా, ధబులు శీసాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మేరకు ఆహ్వానం అందింది. మల్కాన్‌గిరి ఐటీడీఏ పీఓ రామకృష్ణ గొండొ ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ బీడీఏ (బొండా అభివృద్ధి సంస్థ) అధికారులు రాష్ట్రం తరఫున సోమారి, ధబులు దంపతులను ఈ నెల 22న భువనేశ్వర్‌ నుంచి విమానంలో డిల్లీ తీసుకువెళతారని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు వీరికి అభినందనలు తెల్పారు.

English summary

Orissa tribal couple selects for Republic day celebrations for the first time