టైటానిక్ హీరో కారు యాక్సిడెంట్ అయింది .. ఆపై ...

Oscar Winner Leonardo DiCaprio Injured In A Car Accident

11:27 AM ON 23rd August, 2016 By Mirchi Vilas

Oscar Winner Leonardo DiCaprio Injured In A Car Accident

ఆమధ్య టైటానిక్ మూవీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈమూవీతో హీరో లియోనార్డో డికాప్రియో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వీకెండ్ అతడు, తన గాల్ ఫ్రెండ్ తో కారు లో వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. శనివారం తన క్లోజ్ ఫ్రెండ్ నైనా అద్గాల్ తో కలసి న్యూయార్క్ దగ్గర్లోని ఈస్ట్ హాంప్టన్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ జంట ట్రావెల్ చేస్తున్న కారును ఓ మినీ కూపర్ వెనుక నుంచి ఢీకొంది.

ఘటన సమయంలో కారు నెమ్మదిగా వెళ్లడంతో వాళ్లకి గాయాలేవీ కాలేదని తెలుస్తోంది. వెంటనే ఘటన ప్రాంతానికి అంబులెన్స్ చేరుకున్నాయి. వెనుక సీట్లో కూర్చున్న డికాప్రియో, అద్గాల్ లు బలంగా దెబ్బలు తగిలాయన్నది హాలీవుడ్ వర్గాల నుంచి వర్తమానం అందిందని అంటున్నారు. ఇటీవల ఆస్కార్ వేడుకల్లో ఓ మూవీకి ఉత్తమ నటుడిగా లియోనార్డో డికాప్రియో అవార్డు సొంతం చేసుకున్నాడు. అవార్డు వచ్చిన ఉత్సాహంలో క్లోజ్ ఫ్రెండ్స్ మస్త్ పార్టీ ఇచ్చాడు. ఆ క్రమంలో ఆస్కార్ ప్రతిమను బార్ లో మరిచిపోతే, అక్కడి సిబ్బంది తీసుకొచ్చి ఈ హీరోకి ఇచ్చారట కూడా. ఒళ్ళు తెలియకుండా తాగేస్తే అంతేమరి అంటూ కామెంట్స్ పడుతున్నాయి.

ఇవి కూడా చదవండి:సింధుకు కోచ్ గా గోపీచంద్ తొలగింపు!

ఇవి కూడా చదవండి:తొలి చూపులో ప్రేమ అబద్ధమేనట

English summary

Titanic Movie Hero and Oscar Award Winner Leonardo DiCaprio was severely injured in a car accident. He was travelling along with his girlfriend Nina Agdal. They two were severely injured in this accident.