తాగిన మత్తులో మనవాళ్ళు మాట్లాడే వింత మాటలు!

Our Indians funny talk after drinking alcohol

12:11 PM ON 22nd September, 2016 By Mirchi Vilas

Our Indians funny talk after drinking alcohol

మందు తాగితే ఇక మనలోకంలో ఉండడని మనవాళ్ళు మందుబాబుల గురించి చెబుతుంటారు. అందుకే, భారతీయ పురుషులకీ, మద్యానికీ అవినాభావ సంబంధం ఉన్నట్లేనని చెప్పవచ్చు. పురాణాల ప్రకారం కూడా మద్యం ప్రస్తావన వుంది. పాల సముద్రాన్ని చిలికితే, ఓ పక్క అమృతం, మరోపక్క మద్యం అదేనండీ సురాపానం వచ్చాయి అంటారు కదా. ఇక సినిమాల పరంగా చూస్తే, 1955లో వచ్చిన దేవదాసు సినిమాలో హీరో విరహ వేదనతో మద్యానికి బానిసవుతాడు. అలాంటి సినిమాల్లో డైలాగులు ఆణి ముత్యాలనచ్చు. భగ్నప్రేమికులకీ మద్యం పర్యాయ పదంగా మారడానికి ఆ సినిమా దోహదం చేసిందో లేదో కానీ భగ్న ప్రేమికులు చాలా మంది మద్యం తీసుకోవడానికి దేవదాసు కారణమయ్యాడని మాత్రం అనేవారు. అంటున్నారు కూడా.

అదీకాకుండా మగవారికి పార్టీలంటే మందు ప్రదానం అయింది. అమితాబ్ నటించిన అమర్-అక్బర్-ఆంటోనీ కానీ షారుఖ్ నటించిన దేవదాసు కానీ చూస్తే దానిలో వారు మద్యం తీసుకున్నప్పుడు చెప్పే డైలాగులు అద్భుతం. అలా నిషాలో చెప్పే మాటలు కొన్ని నవ్వు తెప్పించినా కొన్ని కన్నీరు పెట్టిస్తాయి. సినిమాల్లో పుట్టి పెరిగిన భారతీయ పురుషులు మద్యం తీసుకోగానే ఒక సినిమా డైలాగ్ చెప్పడమో లేక అన్ని వివరాలతో ఒక బాధాకరమైన సంఘటనని దోస్తులతో పంచుకోవడం/కనీసం ఓ పాట పాడతారు. మద్యం త్రాగినప్పుడు సౌభ్రాతృత్వం వెల్లివిరిసి గత సంఘటనలన్నీ బయటకొస్తాయి. తాము బాగా నిషాలో ఉన్నామని ఎవ్వరూ ఒప్పుకోకపోయినా వారు నిషాలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలని చూస్తేనే అర్ధమవుతుంది.

నిషాలో ఉన్న చాలా మంది మాట్లాడే మాటలు క్రింద ఇచ్చాము చూడండి. కానీ మద్యం తీసుకోగానే నిషాలో జారిపోవడం అన్నది మనిషి మనిషికీ మారుతుంది. అందుకే నిషాలో వారు చెప్పే క్రింద ఇచ్చే మాటలు అందరూ అదే క్రమంలో చెప్పకపోయినా దాదాపు ఇవే మాట్లాడతారు.

1/10 Pages

నిషాలో ఉన్నప్పుడు భావోద్వేగ పాటలు వినగానే భారతీయ పురుషులు చిన్న పిల్లలలాగ ఏడుస్తారు. తమ గతానుభవాలని పాట సాహిత్యంతో పోల్చుకుని గతానుభవాలు కూడా అచ్చం అలాగే ఉన్నాయని చెప్తారు.

English summary

Our Indians funny talk after drinking alcohol