'ఆక్సిజన్' ఫస్ట్ లుక్ తో అదరగొడుతున్న గోపీచంద్

Oxygen first look

05:13 PM ON 14th April, 2016 By Mirchi Vilas

Oxygen first look

మాచో హీరో గోపీచంద్ 'సౌఖ్యం' చిత్రం తరువాత నటిస్తున్న తాజా చిత్రం 'ఆక్సిజన్'. జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఎస్. ఐశ్వర్య నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రాశి ఖన్నా, అను ఇమ్మనుయెల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ సాయి రామ్ క్రియేషన్స్ పతాకం పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగపతి బాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కొద్ది సేపటి క్రితమే విడుదల చేశారు. ఇందులో గోపీచంద్ అటు క్లాస్, ఇటు మాస్ కాకుండా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఒకసారి మీరు కూడా ఓ లుక్ వెయ్యండి.

English summary

Oxygen first look. Machi hero Gopichand latest movie Oxygen first look has been released.