కేవలం 20 లక్షలతో ఫిల్మ్ తీసి, దిమ్మతిరిగేలా చేశారు

Ozhivu divasathe kali Movie Creating Records

11:22 AM ON 22nd July, 2016 By Mirchi Vilas

Ozhivu divasathe kali Movie Creating Records

కొత్త మూవీ ట్రైలర్ కే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న రోజుల్లో 20 లక్షల రూపాయలతో అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ తీసి సక్సెస్ కొట్టేశారు. అవును నిజం. ఇంకా చెప్పాలంటే, మీడియాలో కోట్ల రూపాయల పబ్లిసిటీ లేదు. సినిమాపై సెలెబ్రిటిల అభిప్రాయల్లేవు. అలాగని మూవీ లొకేషన్ల గురించి సినీ మ్యాగజైన్లలో గొప్పల్లేవు. మలయాళ మంత్రమే వేశారో, ఏ మాయే చేశారో కానీ, అతి తక్కువ బడ్జెట్ తో సినిమా తీసి హిట్ కొట్టేసారు. రీసెంట్ గా రిలీజైన ఒజివు దివసాతే కాలి అనే మలమాళం మూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయింది. కోట్లరూపాయల ఖర్చు కాకుండా కేవలం 20 లక్షల రూపాయల ఖర్చుతో ఈ సినిమా కంప్లీట్ చేయడం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే రివల్యూషన్ గా చెప్పుకుంటున్నారు. మలయాళం ఫిల్మ్ డైరెక్టర్ సనాల్ కుమార్ శశి దర్శన్ తీసిన ఒజివు దివసాతే కాలి( శెలవు రోజు సంతోషం) మూవీ తో సినిమా అంటే కోట్ల ఖర్చు అనే అపోహ తుడచిపెట్టుకుపోయింది. ఒక సినిమా తీయాలంటే ఎంత లేదన్నా మినిమమ్ ఇరవై కోట్లు ఖర్చు అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ లు కూడా కోట్లు డిమాండ్ చేస్తున్న ట్రెండ్ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేకుండానే ఒజివు దివసాతే కాలి మూవీ కంప్లీట్ చేశారు. ఆన్ లొకేషన్ యాంబియన్స్ తప్ప ఈ మూవీకి ప్రత్యేకమైన మ్యూజిక్ అంటూ లేదు. సినిమా మొత్తంలో బడ్జెట్ అంటే, కేవలం 20 లక్షల రూపాయల ఖర్చుతో కంప్లీట్ చేసేశారు. నమ్మబుద్ధి కాకపోయినా,ఇది నిజం.

ఇక ఈ కథ లోకి వెళ్తే.. ఎలక్షన్ల సందర్భంగా వచ్చిన లాంగ్ లీవ్స్ ను ఎంజాయ్ చేయడానికి అయిదుగురు ఫ్రెండ్స్ ఫారెస్ట్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. వెళ్తూ తమతోబాటు కొద్దిగా లిక్కరూ తీసుకెళ్తారు. మరి మందుకు తోడు ముక్క కాంబినేషన్ కదా. అందుకే చికెన్ కూడా తీసుకెళ్తారు. కేరళ అడవుల్లోకి వెళ్లిన అయిదుగురు ఫ్రెండ్స్ మధ్య ఎడతెగని మాటలు. వాటికి తోడు తెరిపి లేని వర్షం. మధ్యలో ఉరుములు మెరుపుల్లా ఎలక్షన్స్ న్యూస్ స్క్రీన్ మీద వచ్చిపోతూ ఉంటాయి. అడవిలోకి హాలిడే ట్రిప్ కు వచ్చిన వీళ్లకు వండి పెట్టేందుకు ఒక మధ్యవయసు మహిళ పనికి కుదురుతుంది. ఇక అప్పటి నుంచి అయిదుగురు ఫ్రెండ్స్ లో కలిగే రకరకాల మార్పులు, వికారాలు చాలా నాచురల్ గా తెరకెక్కించాడు డైరెక్టర్. కడుపులో మందు. గదిలో ఆడమనిషి, బైట వాన, సిని ఫార్ములా ప్రకారం అక్కడో రేప్ జరగాలి. లేదా అయిదుగురి చేతిలో ఆమె చనిపోవాలి. వీటికి తోడు కొన్ని వేడి వేడి రొమాంటిక్ సీన్లు పండించాలి.

1/4 Pages

కానీ ఈ సినిమాలో అవేవి కనిపించవు. ఇక తీసుకెళ్లిన మందులోకి కోడికూర వండిపెట్టమని అడుగుతారు. కూర అయితే వండుతాను కానీ, కోడిని మాత్రం నేను చంపనని మహిళ చెప్పడంతో అయిదుగురిలో ఒక ఫ్రెండ్ కోడి మెడకు తాడు కట్టి చెట్టుకు వేలాడదీసి కోడిని చంపేస్తాడు. మహిళ కోడి కూర వండే పనిలో పడుతుంది. బైట వాన, వంట్లో మందు వేడి కోరికలు పుట్టించడంతో అయిదుగురు ఆ మహిళ వైపు దొంగ చూపులు చూస్తుంటారు. తీరా ఏం జరగదు. ఆ మహిళ వంట చేసి తనకు రావలసిన డబ్బు తీసుకుని వెళ్లిపోతుంది. ఇక్కడితో ఇంటర్వెల్.

English summary

Malayalam Film named "Ozhivu divasathe kali" was creating records in Malayalam and this movie was taken with just 20 lakhs.