నాగార్జున చేతిలో 'పడేసావే'

Padesave teaser launched by Nagarjuna

01:25 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

Padesave teaser launched by Nagarjuna

కార్తీక్ రాజ్, నిత్యా శెట్టి, శ్యామ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'పడేసావే'. అక్కినేని స్టూడియోస్ సంస్థ నిర్మించిన కొన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన చునియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. అయాన్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో వైభవంగా నిర్వహించారు. ఈ చిత్ర కార్యక్రమానికి అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరై 'పడేసావే' టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.

మా సంస్థ(అన్నపూర్ణ స్టూడియోస్)లో అన్ని విభాగాల్లో పనిచేసి ఎంతో అనుభవం సంపాదించుకున్న చునియా ఓ చిత్రం తెరకెక్కిస్తుందంటే ఆ చిత్రాన్ని నేనే దగ్గరుండి ప్రమోట్ చేయాలని ముందు నుంచి అనుకున్న. ఒక ఫీల్ గుడ్ లవ్స్టోరీ ని అందరూ నమ్మకం ఉంది. ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందించా, ఈ చిత్రం తప్పకుండా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్న అని నాగ్ తెలిపారు. ఇక రాఘవేంద్రరావు మాట్లాడుతూ చునియా తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్న అని చెప్పారు.

English summary

Padesave teaser launched by Nagarjuna and K. Raghavendra Rao. Anup Rubens composed music to Padesave movie.