వీడియో గేమ్స్ తో పెయిన్ రిలీఫ్

Pain Relief With This Video Game

10:57 AM ON 29th January, 2016 By Mirchi Vilas

Pain Relief With This Video Game

వీడియో గేమ్స్ తో పెయిన్ రిలీఫ్.. వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇది నిజమే. అగ్నిప్రమాదాల్లో గాయపడిన వారి నొప్పిని తగ్గించడానికి ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు సరికొత్త నింటెండో వి అనే ఓ ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని ఆవిష్కరించారు. దీనిని ఉపయోగించి వీడియో గేమ్స్‌ ఆడితే బాధితులకు చాలా వరకు ఉపశమనం కలుగుతుందట. ఆస్ట్రేలియాకు చెందిన నోట్రీ డామ్‌ యూనివర్సిటీలోని శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. డాలె ఎడ్గర్‌ సారథ్యంలో శాస్త్రవేత్తల బృందం 22 మంది అగ్ని ప్రమాద బాధితులపై పరిశోధనలు జరిపింది. ఇందులో 17 మంది పురుషులు, ఐదుగురు స్త్రీలు ఉన్నారు. వీరంతా అగ్నిప్రమాదాల కారణంగా చేతికి, కాళ్లకు గాయాలైనవారు.

సాధారణంగా అగ్నిప్రమాదంలో గాయలైతే దాని ప్రభావం ఎక్కువగా నరాలపై ఉంటుంది. ఫలితంగా వారు కాళ్లు, చేతులను కదిపినప్పుడు విపరీతమైన నొప్పిపుడుతుంది. కానీ ఈ పరికరంతో వీడియో గేమ్స్‌ ఆడిన తరువాత నొప్పి ప్రభావం దాదాపు 17 శాతం తగ్గినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. బాధితులకు తాత్కాలిక ఉపశమనం కలిగించడానికి ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

English summary

A new video game named "Nintendo Wii " will help to reduce the pain burn victims. This video game was developed by scientists belong to Notre Dame University In Australia.They have been tested this video game on 22 burn victims and found that the pain was reduced