క్యా కూల్‌ హై హమ్ 3పై పాక్ బ్యాన్

Pakistan Banned Kyaa Kool Hain Hum 3 Movie

05:05 PM ON 26th January, 2016 By Mirchi Vilas

Pakistan Banned Kyaa Kool Hain Hum 3 Movie

బూతు చిత్రంగా విమర్శలు ఎదుర్కొంటున్న క్యా కూల్‌ హై హమ్‌ 3 చిత్రంపై పాకిస్థాన్ నిషేధం విధించింది. దీనిపై నిషేధం విధిస్తున్నట్లు పాక్‌ సెన్సార్‌ బోర్డు ప్రకటించింది. నిబంధనలను అతిక్రమించి సినిమాను ప్రదర్శించిన డిస్ట్రిబ్యూటర్లకు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. బాలీవుడ్‌ నటులు తుషార్‌ కపూర్‌, అఫ్తాబ్‌ శివదాసని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం క్యా కూల్‌ హై హమ్‌ 3. పోస్టర్ల విడుదల నుంచే ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అశ్లీలత శృతిమించిందని, వెగటు పుట్టించే సన్నివేశాలు, ద్వందార్థాలు ఉండటంతో ఇది యువత పై ప్రభావం చూపుతుందని పాక్‌ సెన్సార్‌ బోర్డు వ్యాఖ్యానించింది. అందుకే ఈ చిత్రాన్ని నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.

English summary

Pakistan Banned Kyaa Kool Hain Hum 3 Movie in Pakistan due to there were soo many Vulgar scenes in the film.The film is full of nudity and has a lot of vulgar content in its dialogues