పాక్ మిలటరీని ఉతికేసిన పాక్ బ్యూటీ(వీడియో)

Pakistan beauty fires on Pakistan army

11:38 AM ON 14th October, 2016 By Mirchi Vilas

Pakistan beauty fires on Pakistan army

అవును పాకిస్తాన్ చేష్టలను ప్రపంచమంతా ఖండిస్తుంటే, సొంత దేశంలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూరీ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత్ జరిపిన సర్జికల్ దాడుల తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. దాడులు జరగలేదని పాక్ పైకి బొంకినప్పటికీ, రగిలిపోయింది. అందుకే ఓ దశలో యుద్ధం తప్పదన్న సంకేతాలు వెళ్లాయి. భారత్ లో జరుగుతున్న ఉగ్రదాడులకు పాక్ వైపు నుంచి పూర్తిగా మద్దతు ఉందనేది జగద్విదితం. ఉగ్రవాదులకు పాక్ మిలటరీ నుంచి పూర్తి సహాయసహకారాలు అందుతున్నాయని ప్రపంచం కూడా గుర్తించింది.

అందుకే అన్ని దేశాలు భారత్ కి అండగా నిలిచాయి. ఇక ఉగ్రవాదులకు పాక్ మిలటరీ సహకారంపై పాక్ యువతి ఒకరు ఆర్మీని కడిగి పారేసిన వీడియో ఒకటి తాజాగా బయపడింది. ఏడాది క్రితం నాటిదిగా భావిస్తున్న ఈ వీడియో తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయింది.

English summary

Pakistan beauty fires on Pakistan army