మోడీపై కేసు నమోదు చేయాలంట.. పాక్ కోర్టులో పిటీషన్!

Pakistan court gave petition to arrest Narendra Modi

12:36 PM ON 23rd July, 2016 By Mirchi Vilas

Pakistan court gave petition to arrest Narendra Modi

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలతోనే జమ్మూకశ్మీర్ లో అమాయకులను చంపుతున్నారని అబ్దుల్ హమీద్ అనే లాయర్ ఆరోపించాడు. ఇంతకీ ఈ లాయర్ పాకిస్థాన్ కి చెందిన వ్యక్తి. పిటీషన్ కూడా అక్కడే వేసాడు. మోడీపై కేసు నమోదు చేయాలంటూ పాకిస్థాన్ కు చెందిన ఆ న్యాయవాది లాహోర్ హైకోర్టును శుక్రవారం ఆశ్రయించారు. మోడీపై హత్య, ఉగ్రవాదం నేరాలకు సంబంధించి పాక్ పీనల్ కోడ్, ఉగ్రవాద వ్యతిరేక చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని పిటీషన్ లో పేర్కొన్నాడు. అయితే పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ జమ్మూకశ్మీర్ లో హింసను ప్రేరేపిస్తున్నారని, యువతను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టిస్తున్నారని భారత్ కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక ఫ్రంట్ అధ్యక్షుడు విరేష్ శాండిల్యా ఆరోపించారు.

నవాజ్ షరీఫ్ పై కేసు నమోదు చేయాలని కోరుతూ ఇటీవల అంబాలా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనికి బదులుగా పాక్ న్యాయవాది అబ్దుల్ హమీద్ భారత ప్రధాని మోడీపై కేసు నమోదుకు లాహోర్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసినట్లు చెబుతున్నారు. కౌంటర్ ఎటాక్ లు ఇలానే ఉంటాయా.

English summary

Pakistan court gave petition to arrest Narendra Modi