ఒక్క ఛాన్స్ ఇవ్వండి భారత్ ను ఊతికారేస్తా..

Pakistan Fan Wants Chance To Play Against India

07:20 PM ON 1st March, 2016 By Mirchi Vilas

Pakistan Fan Wants Chance To Play Against India

ప్రపంచ వ్యాప్తంగా ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ కు వచ్చినంత ఆదరణ మరే రెండు టీంలు ఆడినా రాదు. ఇటీవల ఆసియ కప్ సందర్భంగా బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో , భారత్ పాకిస్తాన్ పై అద్భుతమైన విజయం సాధించింది. దీంతో ఓటమిని ఒర్చుకోలేకపోయిన పాకిస్తాన్ అభిమానులు పాక్ క్రికెటర్ల దిష్టి బొమ్మలను దహనం చేసి పాక్ క్రికెటర్లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసారు.

అందరిది ఒక ఎత్తైతే ఒక అభిమాని మరో అడుగు ముందుకేసి పాకిస్తాన్ క్రికెటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ భారత బౌలర్లను ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్ బాట్స్ మెన్కు తెలియదని. తనకు ఒక్క అవకాసం ఇస్తే హెల్మెట్ లేకుండా భారత బౌలర్లకు తగిన గుణపాటం చెబుతానంటూ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో పాటు ఇమ్రాన్ ఖాన్ లకు విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియోను ఫేస్బుక్ లో పెట్టాడు. దీన్ని చూసిన భారత అభిమానులు ప్రొఫెషనల్స్ క్రికెటర్స్ చెయ్యలేని పని నువ్వు చేస్తావా అంటూ జోక్ లు వేసుకుంటున్నారు.

Yeh bhai ne tou mujhe bhi rula diya :'(

Posted by Sarcasmistan on Saturday, February 27, 2016

English summary

An Angry Fan From Pakistan Asked chance to play against India.He says that he will bat without helmet and hit Indian bowlers.He posted a video by requesting Nawaz Sharif and Imran Khan.