ఎంత బరితెగించారు ... మహిళా ఎంపీపై లైంగిక వేధింపులు

Pakistan Female MP Harassed In Parliament

10:55 AM ON 26th January, 2017 By Mirchi Vilas

Pakistan Female MP Harassed In Parliament

మహిళలపై , చివరకు అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడే తీరు చూస్తున్నాం. ఇప్పుడు ఏకంగా ఓ మహిళా ఎంపీ పై అందునా పార్లమెంట్ లోనే లైంగిక వేధింపులకు గురించేశారంటే ఏమనాలి. అయితే అలా చేసింది భారత్ లో కాదు, మన పొరుగుదేశం పాకిస్తాన్ లో... అవును నిజం. అక్కడ మహిళలపై వేధింపులు పరాకాష్టకు చేరాయి. సామాన్యులే కాదు ప్రజా ప్రతినిధులు కూడా బాధితుల జాబితాలో చేరుతున్నారు. చట్టాలు రూపొందించే ప్రదేశమే ఈ వేధింపులకు వేదికవ్వడం శోచనీయం. దేశంలోని అత్యున్నత రాజ్యాంగ వేదిక ప్రాంగణంలోనే ఓ మహిళకు తీరని అవమానం అయింది. .వేధింపులకు గురైంది, పైగా పిర్యాదు చేసినా పట్టించుకోలేదట. సాక్షాత్తు ఆ రాజ్యాంగ వేదిక సభ్యురాలు కావడమే కాదు, ఆమెను లైంగికంగా వేధించింది కూడా సాదాసీదా వ్యక్తి కాదు. ఆ దేశ మంత్రి. మహిళా ఎంపీ పట్ల అగౌరంగా ప్రవర్తించి తన మంత్రి సీటుకే కాకుండా.. ఆ దేశ పార్లమెంట్ కే మచ్చ తెచ్చాడు. పాకిస్తాన్ పార్లమెంట్ సాక్షిగా సింధ్ ప్రావిన్స్ కు చెందిన మహిళా ఎంపీ నుస్రాత్ సహార్ అబ్బాసీ లైంగిక వేధింపులకు గురయ్యారు. మంత్రి ఇమాద్ పితాఫీ స్వయంగా ఆమెను తన కార్యాలయంలోకి పిలిచి వేధించాడు. ఈ ఘటనపై పార్లమెంట్ లో ఫిర్యాదు చేసినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు.

దీంతో నుస్రాత్, మీడియా ముందుకు వచ్చి, మంత్రి తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని కన్నీటి పర్యంతమయ్యారు. జరిగిన సంఘటనపై తాను ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించలేదని, దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. సహచర ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల దుస్థితి ఏంటని ప్రశ్నించారు. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ మహిళ అయినా.. తనకు జరిగిన అన్యాయం గురించి చెబితే మద్దతుగా నిలవలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు.. చేతిలో పెట్రోల్ సీసా పట్టుకుని తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఈ సంఘటన చర్చనీయాంశమైంది. అంతేకాదు.. సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తాయి. నుస్రాత్ కు మద్దతుగా ఉద్యమమే మొదలైంది.

కాగా, ఈ విషయం బయటకు పొక్కిన తరువాత ఆలస్యంగా మేల్కొన్న ఫెడరల్ పార్టీ వర్గాలు నుస్రాత్ ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్లు ప్రకటించాయి. అంతేకాదు పార్టీ ఒత్తిడితో ఎంపీ నుస్రాత్ పట్ల తాను అలా ప్రవర్తించలేదంటూ నుస్రాత్ మనోభాం దెబ్బతిన్నట్లయితే మన్నించాలంటూ క్షమాపణ కోరారు. అయితే ఈ అంశానికి ఇంతటితో ముగింపు లేదని, లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళలకు సంబంధించిన చట్టాలకు ఇది ఒక సవాల్ గా నిలిచిందని బాధితురాలు నుస్రాత్ అబ్బాసీ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి: విద్యార్థులకు దిమ్మ తిరిగే హామీ ఇచ్చిన కాంగ్రెస్

ఇవి కూడా చదవండి:ఆ ఫామిలీపై దెయ్యం దాడి చేసిందట

English summary

Pakistan Female MP was harassed in the Pakistan Parliament. She was complained to the officials over there but no one was taken seriously her comments and later she talked with media by saying that Pakistan minister was harassed her.