పాక్ జెండాతో బిజెపి ఎమ్మెల్యే పోస్టర్‌ ?

Pakistan Flag In The Hands Of BJP MLA

04:41 PM ON 31st December, 2015 By Mirchi Vilas

Pakistan Flag In The  Hands Of BJP MLA

అంది వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఒకోసారి కొంప ముంచుతుంది. మార్ఫింగ్ చేయడం , సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన విధంగా ప్రచారం చేయడం ఇటీవల బాగా పెరిగిపోయింది. తాజాగా ఓ బిజెపి ఎంఎల్ఏ పేరిట దర్శన మిచ్చిన పోస్టర్ కల కలం రేపుతోంది. డిమాండ్ లు , వివరణలు సరే సరి. వివరాల్లోకి వెళితే ...

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్‌ బిజెపి ఎమ్మెల్యే విశ్వాస్‌ సరంగ్‌ ఫొటోతో ఉన్న ఒక పోస్టర్‌లో పాకిస్థాన్‌ జెండా ఉంది. దీంతో సంచలనం రేగింది. ఈద్‌-మిలాద్‌-ఉన్‌- నబీ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఓ విద్యుత్‌ స్తంభంపై ఏర్పాటుచేసిన ఆ పోస్టర్‌ చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు.

విషయం తెల్సుకున్న ఎమ్మెల్యే కు కోపం చిర్రెత్తు కొచ్చింది. తన పోస్టర్‌ వార్త విని ఆశ్చర్యపోయినట్లు ఆయన పేర్కొంటూ , ఆ పోస్టర్‌తో తనకేమీ సంబంధం లేదన్నారు. కొంతమంది అసాంఘిక శక్తులు కావాలనే ఈ పనిచేశారని ఆయన ఆరోపిస్తూ, దీనిపై భోపాల్‌ డీజీపీకి ఒక లేఖ కూడా ఆయన రాశారు. అసాంఘిక శక్తులు కొందరు... సోషల్‌మీడియా ద్వారా తన పేరుతో తప్పుడు సందేశాలను పంపుతున్నారని ఫిర్యాదు చేశారు.

English summary

BJP MLA named Vishwas Sarang belongs to Bhopal , Madhya Pradesh holds the Pakistan flag in his hand. This was opposed by that MLA and saying that some has morphed his photo