పావురాలతో పాక్ బెధిరింపులు

Pakistan gave warning to India

03:09 PM ON 3rd October, 2016 By Mirchi Vilas

Pakistan gave warning to India

తమ దేశంపై మెరుపు దాడులు జరగలేదని ఓ వైపు బుకాయిస్తున్న పాకిస్థాన్, మరోవైపు అనేక విధాలుగా దుశ్చర్యలకు, వెకిలి చేష్టలకు పాల్పడుతోంది. దురుద్ధేశంతో కూడిన సందేశాలతో బూరాలను, పావురాలను పంజాబ్ లోని సరిహద్దు గ్రామాలకు పంపిస్తోంది. పఠాన్ కోట్ ఎస్ఎస్పీ రాకేశ్ కౌశల్ ఆదివారం మాట్లాడుతూ మన దేశంవైపు వస్తున్న ఓ పావురాన్ని తాము గమనించామని చెప్పారు. ఆ పావురం కాళ్ళకు ఓ సందేశం కట్టి ఉందని, దానిపై మోదీ... విను! పాకిస్థాన్ లోని బాలలంతా పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. కశ్మీరుపై దుశ్చర్యలకు ప్రతీకారం తీర్చుకుంటాం. పాకిస్థాన్ 1971లో మాదిరిగా ఉండదు అనే సందేశం ఉందని తెలిపారు. దీనిని బేశుక్ర తబిబ రాసినట్లు ఉందని అంటున్నారు.

1/3 Pages

బుడగలతో కూడా హెచ్చరిక...


అలాగే అంతకు ముందు భారత సరిహద్దుల్లో పసుపుపచ్చని బెలూన్లను ఆ దేశం వదిలింది. వాటిపై.. మోదీ.. మా సత్తా అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటే నేరుగా మాతో తలపడు.. మీ సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటాం అని ఉర్దూలో రెచ్చగొట్టే రాతలు ఉన్నాయి. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్, పఠాన్ కోట్, అమృత్ సర్ ఆర్మీ ఔట్ పోస్టుల వద్ద, సరిహద్దు గ్రామాల్లోని రైతుల పొలాల వద్ద ఇలాంటి బెలూన్లను కనుగొన్నారు. దీనా నగర్ లోని ఘెసాల్ గ్రామంలో కనబడిన గాలి బుడగలో.. మోదీ.. ఆయూబ్ తుపాకులు(ఆశయాలు) ఇంకా మా దగ్గర ఉన్నాయి.. ఇస్లాం జిందాబాద్ అని రాసి ఉన్న బెలూన్ ని చూశారట. ఇదే గ్రామంలో గత ఏడాది ఉగ్ర దాడి జరిగింది. ఈ బెలూన్ల వ్యవహారాన్ని సైన్యం తీవ్రంగా పరిగణించి, వీటి నిగ్గు తెలుస్తోంది.

English summary

Pakistan gave warning to India