పాకిస్తాన్ ఇండియాకు వస్తోంది..!

Pakistan Government Pakistan Cricket Team To Come India

06:02 PM ON 26th February, 2016 By Mirchi Vilas

Pakistan Government Pakistan Cricket Team To Come India

టీ20 వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ జట్టును భారతదేశం పంపేందుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతిచ్చింది. పాక్‌ టీమ్ భద్రతపై అనుమానంతో కొంతకాలంగా నిర్ణయాన్ని వాయిదా వేసిన అక్కడి ప్రభుత్వం తాజాగా బీసీసీఐ అత్యున్నత భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వడంతో అంగీకరించింది. ఈ నిర్ణయంపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ షహర్యార్‌ ఖాన్‌ మాట్లాడుతూ భారత్‌ ప్రభుత్వం పాక్‌ క్రికెట్‌ జట్టు పర్యటన, వసతులు విషయంలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని.. మ్యాచ్‌లను వీక్షించేందుకు వచ్చే అభిమానులకు వీసా సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవాలని సూచించారు. టీ20 ప్రపంచకప్‌ మార్చి 8న ఆరంభమై.. ఏప్రిల్‌ 3న ఫైనల్‌తో ముగియనుంది. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య మార్చి 19న ధర్మశాల వేదికగా మ్యాచ్‌ జరగనుంది.

English summary

Pakistan cricket team have received Pakistan government clearance to travel to India and participate in the World Twenty20, bringing to an end a period of uncertainty about their involvement in the tournament.