పాకిస్థాన్ లో నలుగురు ఉగ్రవాదులకు ఉరి

Pakistan Hanged 4 Terrorists to Death

04:49 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Pakistan Hanged 4 Terrorists to Death

పాకిస్థాన్‌లో నలుగురు ఉగ్రవాదులకు ఉరి శిక్ష అమలు చేశారు. పాక్ లోని పెషావర్‌లో గతేడాది ఓ సైనిక పాఠశాలపై ఉగ్రవాదులు దాడి చేసి మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనకు బాధ్యులైన కొందరు ఉగ్రవాదులకు పాక్‌ ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేసింది. తాజాగా మరో నలుగురు ఉగ్రవాదులకు మంగళవారం ఉరిశిక్ష అమలు చేసినట్లు పాక్ అధికారులు వెల్లడించారు.

కొహత్‌ సెంట్రల్‌ జైలులో నూర్‌ సయీద్‌, మురద్‌ఖాన్‌, ఇనాయత్‌తుల్లా, ఇసారుద్దీన్‌ అనే నలుగురు ఉగ్రవాదులను ఉరితీశారు. 2014 డిసెంబర్‌ 16న పాకిస్థాన్‌లోని పెషావర్‌ సైనిక పాఠశాలపై తెహ్రిక్‌ ఈ తోయిబా ఉగ్రవాదులు భీకర దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 150మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే. దీంతో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు పాకిస్థాన్‌ ప్రభుత్వం నేషనల్‌ యాక్షన్‌ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 637 మంది ఉగ్రవాదులకు ఉరిశిక్ష అమలుచేయగా.. మరో 710 మందిని అరెస్టు చేశారు.

English summary

Reports saying that Pakistan executed hang for 4 terrorists to death. These terrorists were involved in last year's Army Public School attack in Peshawar.