అమరావతిలో అణుబాంబుల తయారీ - పాకిస్తాన్ రూమర్లు

Pakistan Media Accuses AP Of Making Hydrogen Bomb In Amaravathi

12:41 PM ON 8th June, 2016 By Mirchi Vilas

Pakistan Media Accuses AP Of Making Hydrogen Bomb In Amaravathi

ఇప్పటికే అనేక కష్టాలతో నెట్టుకొస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలన సాగిస్తుంటే, ఇప్పుడు మరో పిడుగుపాటు వార్త వచ్చి పడింది. రెండు రాష్ట్రాలుగా విడిపోయి అద్భుతమైన రాజధాని నిర్మించుకోవాలని తపన పడుతున్న ఆంధ్రప్రదేశ్ మీద పాకిస్తాన్ బరితెగించి పుకార్లు పుట్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అణుబాంబులు తయారీకి రంగం సిద్దమౌతోందంటూ పాకిస్తాన్ మీడియా కొత్త పల్లవి అందుకుంది. అంతేకాదు, ఏపీలో హైడ్రోజన్ బాంబు తయారు చేస్తున్నారంటూ సరాసరి డిబేటే పెట్టేసింది. ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద నగరం నిర్మించి అణుబాంబులు తయారు చేయబోతున్నారని మీడియా ముఖంగా ప్రచారం మొదలు పెట్టింది. అంతేకాదు, అమరావతి ఒక న్యూక్లియర్ సిటీ అని, అక్కడ హైడ్రోజన్ బాంబ్ తయారు చేస్తున్నారని, దీనికి అమెరికా సాయం చేస్తోందని రూమర్లు క్రియేట్ చేస్తోంది.

ఇదంతా పాకిస్తాన్, చైనాలపై కక్షకట్టే ఇలాంటి నగరాన్ని నిర్మిస్తోందని కూడా ఆరోపించింది. పాక్ పై అణుబాంబు వేసేందుకు ఇండియా కుట్ర చేస్తోందని, ఇందులోఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కీలకపాత్ర పోషిస్తోందని వదంతులు పుట్టిస్తోంది.

ఇవి కూడా చదవండి:మళ్ళీ దీక్షకు రెడీ - డెడ్ లైన్

ఇవి కూడా చదవండి:ఐదో అంతస్తు నుంచి దూకి నవ వధువు ఆత్మహత్య

English summary

Pakistan Media accuses that India was making Hydrogen bombs in Amaravathi by targetting China Pakistan. And also the media of pakistan said that America was giving help to India for making Hydrogen Bombs.