మెరుపుదాడిని ఒప్పేసుకున్న పాక్ పోలీస్

Pakistan police agreed the truth

01:37 PM ON 6th October, 2016 By Mirchi Vilas

Pakistan police agreed the truth

పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర శిబిరాలపై భారత ఆర్మీ చేపట్టిన మెరుపుదాడి గురించి ఇప్పటివరకూ బుకాయిస్తూ వస్తున్న పాకిస్తాన్ ఎట్టకేలకు ఆ దాడి వాస్తవమేనని ఒప్పేసుకుంది. పాకిస్థాన్ కు చెందిన ఓ పోలీస్ అధికారి ఈ వాస్తవాన్ని అంగీకరించారు. జమ్మూకశ్మీర్ లోని ఉరీ సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా సెప్టెంబర్ 28 అర్థరాత్రి తర్వాత భారత కమాండోలు సరిహద్దు దాటారు. పీవోకేలోని ఏడు ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసి సుమారు 40 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. అయితే ఈ సర్జికల్ స్ట్రైక్స్ బూటకమని పాకిస్థాన్ తో పాటు భారత్ లోని కొన్ని రాజకీయ పార్టీలు వాదిస్తున్నాయి. మెరుపు దాడిని వీడియోలో చిత్రీకరించినట్లు ఇండియన్ ఆర్మీ చెబుతున్నా వారు నమ్మడం లేదు.

అయితే పీవోకేలోని మిర్పూర్ రేంజ్ స్పెషల్ బ్రాంచ్ ఎస్పీ గులాం అక్బర్ అసలు విషయం బయటపెట్టారు. ఓ టీవీ ఛానల్ ప్రతినిధి పాక్ ఐజీగా నమ్మించి ఫోన్ చేసి ఆయనతోనే ఆ నిజం చెప్పించారు. భారత్ చేపట్టిన మెరుపు దాడుల్లో ఉగ్రవాదులతో పాటు ఐదుగురు పాకిస్థాన్ సైనికులు కూడా మృతి చెందినట్లు గులాం అక్బర్ తెలిపారు. అనంతరం వెంటనే అక్కడికి వచ్చిన పాక్ సైనికులు ఆ మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా తరలించినట్లు ఆయన వివరించారు. పరిసర గ్రామాల్లో ఉగ్రవాదుల మృతదేహాలను ఖననం చేసినట్లు కూడా ఆయన ఒప్పుకున్నారు. పాక్ ఆర్మీనే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, ఉగ్రవాదులను సరిహద్దులు దాటించి భారత్ లో దాడులకు పంపుతోందని పాక్ ఎస్పీ స్వయంగా వెల్లడించడం గమనార్హం.

English summary

Pakistan police agreed the truth