చంపేస్తానన్నా నేను పోర్న్ స్టార్ గానే ఉంటా.. నదియా సంచలన వ్యాఖ్యలు!

Pakistan porn star Nadia Ali shocking comments

06:11 PM ON 1st August, 2016 By Mirchi Vilas

Pakistan porn star Nadia Ali shocking comments

పాకిస్థాన్ మోడల్ ఖండీల్ బలోచ్ హత్యకు గురైన నేపథ్యంలో.. పాకిస్తాన్ పోర్న్ స్టార్ నదియా అలీ(25) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఖండీల్ ను పరువు కోసం ఆమె సోదరుడే చంపేసిన నేపథ్యంలో.. తనను చంపేస్తానని చెప్పినా సరే పోర్న్ స్టార్ గానే స్క్రీన్ పై కనిపిస్తానని, ఆ వృత్తిని వదులుకునే ప్రసక్తే లేదని.. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో స్థిరపడిన నదియా అలీ తెగేసి చెప్పింది. ముస్లిం సంప్రదాయ దుస్తుల్లోనే పోర్న్ స్టార్ గా నటించే తనకు మిలియన్ల మంది వ్యూయర్స్ ఉన్నారని వివరించింది. డాన్సర్ గా కెరీర్ ను ప్రారంభించిన నదియా ఆ తర్వాత పోర్న్ స్టార్ గా మారిపోయింది. ఇప్పటికే లక్షలాదిమంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న నదియాను పాకిస్థాన్ నిషేధించింది.

తనను పాకిస్థాన్ అధికారికంగానే బ్యాన్ చేసిందని నదియా ఈ వృత్తిలో తనకు ఎంతో సంతోషం లభిస్తోందని పేర్కొంది. ఇక నదియా కుటుంబీకులు పాకిస్థాన్ లో ఉన్నప్పటికీ నదియా అక్కడి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. తానో ముస్లింనని దీంతో తనకు కష్టాలు ఎక్కువని ఆమె పేర్కొంది. తాను ఎంచుకున్న వృత్తితో తల్లిదండ్రులు అంత సంతోషంగా లేకపోయినా తర్వాత వారు అర్థం చేసుకున్నారని నదియా చెప్పుకొచ్చింది. ఓ కూతురుగా తాను చేసే పనిని ఏ తల్లిదండ్రులు అంగీకరించరని, కానీ తప్పని పరిస్థితుల్లోనే ఈ వృత్తిలోకి అడుగుపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. చివరకు తన ప్రాణానికి ముప్పు వచ్చినా ఈ వృత్తిని వదులుకోనని నదియా తేల్చి చెప్పింది.

English summary

Pakistan porn star Nadia Ali shocking comments