ఉగ్రవాద సంస్థల పై పాక్ ఉదారత

Pakistan Supports terror groups Targeting India

07:23 PM ON 18th December, 2015 By Mirchi Vilas

Pakistan Supports terror groups Targeting India

భారతదేశంలో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాద సంస్థలపై పాకిస్థాన్ ఉదారంగా వ్యవహరిస్తోందని అమెరికా వెల్లడించింది. భారత్, ఆప్ఘనిస్థాన్ లకు ముప్పుగా తయారైన ఉగ్ర సంస్థల పట్ల పాక్ ఉదారంగా వ్యవహరిస్తున్నదని అమెరికా ఉన్నత అధికారి ఒకరు చెప్పారు. పాక్ భూభాగం నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఉగ్ర సంస్థలలో భారత్, ఆప్ఘన్ లలో విధ్వంసం సృష్టించి ఆ దేశాలకు ముప్పుగా తయారైన సంస్థలపై పాకిస్థాన్ దృష్టి సారించడం లేదని, పాకిస్థాన్ లో విధ్వంసం సృష్టించే తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ వంటి సంస్థలపైనే దృష్టి పెట్టిందని పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ లకు అమెరికా తరఫు ప్రత్యేక ప్రతినిధి రిచర్డ్ జి ఒస్లోన్ పేర్కొన్నారు. అంతేకానీ పాకిస్థాన్ భూ భాగం నుంచి కార్యకాలాపాలు సాగిస్తూ పొరుగు దేశాలైన భారత్, ఆప్ఘనిస్థాన్ లలో విధ్వంసాలకు పాల్పడి ఆయా దేశాలలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న ఉగ్ర సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించడం లేదని చెప్పారు.

English summary

One of the US Official said that Pakistan was no focusing on taking action against terror groups that pose a threat to both India and Afghanistan