కోహ్లీకి లవ్ ప్రపోజ్ చేసిన మోడల్ దారుణ హత్య ! (వీడియో)

Pakistani Model Qandeel Baloch Murdered

11:16 AM ON 18th July, 2016 By Mirchi Vilas

Pakistani Model Qandeel Baloch Murdered

టీ-20 వరల్డ్ కప్ లో విరాట్ వీరవిహారం చూసి ఫ్లాటైపోయిన ఓ అమ్మడు లవ్ ప్రపోజ్ చేసింది. ఆమె మరెవరో కాదు పాకిస్థాన్ వివాదాస్పద మోడల్ ఖండీల్ బలోచ్. అప్పట్లో ఈ వీడియో పెద్ద సంచలనమైంది. బలోచ్ తన సొంత అన్నయ్య చేతిలో దారుణ హత్యకు గురైంది. శనివారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. సోషల్ మీడియా వేదికగా అశ్లీల ఫోటోలు పోస్ట్ చేసి తమ కుటుంబ పరువు తీస్తుందనే నెపంతో ఆమెను హతమార్చాడు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. అయితే బలోచ్ ని సొంత బ్రదర్ హత్య చేసినట్లు తెలుస్తోంది. రంజాన్ వేడుకలకు సొంతూరు ముల్తాన్ వచ్చిన బలోచ్ ని ఇంట్లోనే సోదరుడు చంపేసినట్లు తెలుస్తోంది. ఇటీవల బలోచ్ తన పిక్స్ ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంపై కూడా బ్రదర్ ఆగ్రహం వ్యక్తంచేశాడట. మోడలింగ్ నుంచి డ్రాప్ అవ్వాలని, లేకుంటే చంపేస్తామని గతంలో ఆమెకు ఇంటర్నెట్ లో బెదిరింపులు లేకపోలేదు. చివరకు ఫ్యామిలీ పరువు తీస్తుందనే నెపంతో హత మార్చినట్టు స్థానిక మీడియా తెలిపింది.

బలోచ్ చేసిన మ్యూజిక్ వీడియో బ్యాన్ గత వారమే విడుదలై వైరల్ అయ్యింది. బలోచ్ ఇంత పాపులర్ కావడానికి క్రికెటర్ విరాట్ కోహ్లియేనని కారణమని కొందరి వాదన. టీ-20 వరల్డ్ కప్ లో విరాట్ వీరవిహారం చూసి ఫ్లాటై పోయింది ఈ అమ్మడు. ఈ క్రమంలో అతడికి లవ్ ప్రపోజ్ చేసింది కూడా! కోహ్లీని తాను ఎంతగా లవ్ చేస్తున్నానని, అనుష్క శర్మను వదిలేసి తనను లవ్ చేయమని కామెంట్స్ చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. టీ-20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శనపై అప్పట్లో యూట్యూబ్ లో వీడియో పెట్టి బలోచ్ సంచలనం సృష్టించింది. అఫ్రీదీని తిడుతూ, ఏడుస్తూ ఆమె పెట్టిన వీడియో చాలా ఫేమస్ అయ్యింది. కోహ్లీని తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని, అనుష్క శర్మను వదిలేసి తనను లవ్ చేయమని సెన్సేషన్ కామెంట్స్ చేస్తూ యూట్యూబ్ లో వీడియో పోస్ట్ చేసింది. అంతేకాదు, టీ-20 పాక్ గెలిస్తే నగ్నంగా డ్యాన్స్ చేస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పాక్ ఓడిపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కోహ్లీ, అఫ్రీదీయే కాదు షారూఖ్ ఖాన్ వంటి హీరోలపై కూడా యూట్యూబ్ వేదికగా వీడియోల రూపంలో ఈ అమ్మడు కామెంట్స్ చేసేది. మొత్తానికి ఈమెను సొంత బ్రదర్ పొట్టన పెట్టుకున్నాడు.

కాగా సోషల్ మీడియా వేదికగా ఆమె హత్యోదంతంపై పెద్ద యుద్ధమే నడిచింది. ఆమెకు తగిన శాస్తే జరిగిందని కొందరు నెటిజన్లు ట్వీట్ చేయగా ఇప్పటికైనా పరువు హత్యలను అరికట్టేందుకు పాక్ చర్యలు తీసుకోవాలని ఇంకొందరు ట్విట్టర్ వేదికగా అభ్యర్థించారు. కండోల్ హత్యను పెద్దమొత్తంలో నెటిజన్లు ఖండించగా ఆశ్చర్యకరంగా అంతకంటే ఎక్కవ మంది హత్యను సమర్థించారు. ఇటువంటి పనులకు పాల్పడుతున్న ఖండోల్ ను చంపి ఆమె సోదరుడు మంచి పనిచేశాడని చాలామంది వికృత ఆనందం పొందుతూ ట్వీట్లు చేశారు. ఆమెకు పాకిస్థాన్ అంటే ఇష్టం లేదు. ముస్లిం అంటే గౌరవం లేదు అని ట్వీట్లు చేశారు. నగ్న ఫొటోలు పోస్టు చేసేందుకు కూడా వెనకడాని ఆమెకు అన్న సరైన శిక్షే విధించాడు అని మరికొందరు ట్వీట్ చేశారు. ఆమె చేష్టలు ఒక్క పాకిస్థాన్ కే కాదు.. మొత్తం మానవజాతికే అవమానకరం అని మరికొందరు ట్వీట్ల వర్షం కురిపించారు. బలోచి హత్యను సెలెబ్రేట్ చేసుకుంటున్నట్టు ఇంకొందరు నెటిజన్లు పేర్కొనగా ఆమె అంత అవమానకరంగా ఏం ప్రవర్తించిందని చంపేశారని కొందరు విరుచుకుపడ్డారు. మగాళ్లతో పోలిస్తే మహిళలకు సమాన హక్కులు లేవని, బలోచి దేవుడికి విరుద్ధంగా ప్రవర్తించిందని మరికొందరు అక్కసు వెళ్లగక్కారు. అయితే వారి ట్వీట్లపై ఆ తర్వాత నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో బలోచి హత్యను సమర్థించిన వారిలో చాలామంది తమ ట్వీట్లను తీసెయ్యడం విశేషం. కాగా బలోచ్ కోహ్లీకి చేసిన లవ్ ప్రపోజల్ వీడియో కూడా ఓసారి వీక్షించండి.

ఇవి కూడా చదవండి:మీడియా ముందు ఏడ్చేసిన ఊర్వశి రౌతేలా

ఇవి కూడా చదవండి:డైరెక్టర్ తో నదియా రొమాన్స్!

English summary

Popular Pakistani Model Named Qandeel Baloch was murdered by her brother for not accepted to stop her career in Modelling. She became Popular around the world by Proposing to Indian Batsman Virat Kohli.