పాకిస్థాన్ బాహుబలి -- ఇంతకీ ఇతని బరువు తెలిస్తే షాకవుతారు

Pakisthan Bhahubali - Do you Know his weight

10:55 AM ON 17th January, 2017 By Mirchi Vilas

Pakisthan Bhahubali - Do you Know his weight

ఊబకాయులు ,స్థూల కాయులు ఉండడం సహజం. కానీ వయస్సుకు, శరీర బరువుకి కొన్ని రేట్లు తేడా ఉందంటే ఇబ్బందే. ఇలా వున్నవాళ్లను చాలామందిని చూస్తుంటాం. అయితే పాకిస్థాన్ కు చెందిన అర్బాజ్ కైజర్ హయత్ ని చూస్తే, వావ్ అనాల్సిందే. ఎందుకంటే ఇతని వయసు 25. ఎత్తు 6అడుగుల 3అంగుళాలు. అయితే ఇతని బరువు ఏకంగా 435 కిలోలు. అవును నిజమే. అతని బరువు అక్షరాలా 435 కిలోలే. ఇతనికి చాలా స్పెషాలిటీస్ వున్నాయి. అర్బాజ్ ఎంతో సులువుగా చేతి వేళ్ల సాయంతో రెండు కార్లను కలిపి లాగేస్తాడు. అంతేకాదు ట్రాక్టర్ ని కదలకుండా ఆపేస్తాడు.

మనుషుల్ని గాల్లోకి ఎత్తి పట్టుకుంటాడు. ఇంతకీ అతని ఆశయం ఏమిటో తెలుసా... ప్రపంచంలోనే అత్యంత బలవంతుడిగా నిలవడం. ఇలాంటి శరీరాన్ని ఇచ్చినందుకు అర్బాజ్ దేవుడికి కృతజ్ఞతలు కూడా తెలిపాడు. ఇప్పటివరకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదట. డాక్టర్ పర్యవేక్షణలో సలహాలు, సూచనలు పాటిస్తు న్నాడట. టీనేజ్ లో అత్యధికంగా బరువు పెరగడం గమనించానని, అప్పటి నుంచి బరువు పెరిగేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టానని ఆటను చెప్పేమాట. ఇంతకీ బరువెందుకు పెరగాలనుకున్నాడో తెలుసా.. అతని లక్ష్యం వెయిట్ లిఫ్టింగ్ , స్ట్రాంగ్ మాన్ ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలవడం. దీని కోసం బరువులు ఎత్తడంపైన కసరత్తులు చేస్తున్నాడు.

రోజుకి పదివేల క్యాలరీలు ఆహారం అందేలా చూసుకుంటాడు అర్బాజ్ . ఇందుకు 36 గుడ్లు, 3 కేజీల మాంసం, ఐదు లీటర్ల పాలతోపాటు ఇతర ఆహారం తీసుకుంటాడు. మర్దాన్ పట్టణంలో నివసించే అర్బాజ్ ను ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద స్టార్ గా చూస్తారు. ప్రపంచంలో అత్యంత బలవంతుడైన వ్యక్తి అర్బాజ్ అని పాకిస్థాన్ వాసులు అనుకుంటారు. ఈ బాహుబలిని చూసేందుకు రోజూ ఎంతో మంది వస్తుంటారు. వచ్చిన వారందరికి సెల్ఫీ కోసం పోజులిస్తుంటాడు.

ఇక జపాన్ లో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో అర్బాజ్ 4535 కిలోలను ఎత్తి విజేతగా నిలిచాడు. వీలైనంత త్వరగా డబ్ల్యూడబ్ల్యూఈ( వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ ) పోటీల్లో పాల్గొనేందుకు అర్బాజ్ కసరత్తు చేస్తున్నాడు. డాక్టర్ల సూచనల మేరకే బరువులు ఎత్తడం, ఆహారం తీసుకుంటున్నట్లు తెలిపాడు. తన ప్రయత్నాన్ని ఇక్కడితో ఆపనని, ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. పాకిస్థాన్ లో వెయిట్ లిఫ్టింగ్ , రెజ్లింగ్ పోటీలకు తగిన ఆదరణ లేదని.. త్వరలో మార్పులు జరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇతని రూటే వేరు.

ఇది కూడా చూడండి: 4 రోజుల్లో బరువు తగ్గడానికి సూపర్ చిట్కా

ఇది కూడా చూడండి: గోరువెచ్చని నీటిలో ఇది కలిపి పరగడుపున… తాగితే ఎన్నో లాభాలు

ఇది కూడా చూడండి: ఖైదీ గురించి ఎవరేమన్నారు

English summary

A man got unlimited popularity due to his weight, yes in Pakistan a person named Kayath Hazar is the strongest man in Pakistan his weight is 435 K gs