డిప్యూటీ సీఎం గా పళనిస్వామి?

Palani Swamy Was To Be Tamilnadu Deputy CM

11:33 AM ON 8th October, 2016 By Mirchi Vilas

Palani Swamy Was To Be Tamilnadu Deputy CM

తమిళనాడులో రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పళనిస్వామి నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. సేలం జిల్లా నుంచి ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీఎం జయలలిత మరికొంత కాలం ఆస్పత్రిలో ఉంటారని అపోలో వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తమిళనాడులో గవర్నర్ పాలన విధించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి రాష్ట్రపతికి లేఖ రాశారు. పాలన స్థంభించడానికి వీలులేదని ఉద్దేశంతో తమిళనాడుకు డిప్యూటీ సీఎంగా పళనిస్వామిని నియమించే అవకాశం కనిపిస్తోంది.

1/3 Pages

కేంద్రం ఫోకస్

అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యపరిస్థితిపై రకరకాల వదంతులు వస్తున్న తరుణంలో రాష్ట్ర పరిస్థితులపై కేంద్రం ఫోకస్ చేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే గవర్నర్ విద్యాసాగర్ రావు ఆసుపత్రిలో జయలలిత ఆరోగ్యపరిస్థితిని తెలుసుకున్నాక వెంటనే కేంద్రానికి నివేదించారు. కాగా తమిళనాడు మంత్రులు పన్నీర్ సెల్వమ్, ఎడప్పడి కె.పళని స్వామితో శుక్రవారం సమావేశమయ్యారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కూడా విద్యాసాగర్ రావును కలుసుకున్నారు. తమిళనాడు పరిణామాలను గవర్నర్ ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నారు. గవర్నర్ ఇచ్చే వివరాలను బట్టి కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

English summary

Legendary Politician and Tamilnadu State Chief Minister Jaya Lalitha was presently in serious condition she was taking treatment in hospital in Chennai. Now a news came into lime light that party was thinking to appoint MLA Palani Swamy as Deputy Chief Minister to Tamilnadu.