ఈ మహిళ తల తీసుకొస్తే, 7 కోట్లు ఇస్తారట

Palani Who Fought ISIS Is Jailed

11:13 AM ON 21st December, 2016 By Mirchi Vilas

Palani Who Fought ISIS Is Jailed

కొన్ని ఘటనలు వినడానికి భయంగా వున్నా లోతుల్లోకి వెళ్తే అసలు సంగతి తెలుస్తుంది. ఇది కూడా అలాంటిదే. కుర్దూ స్వచ్ఛంద పరిరక్షక దళానికి చెందిన 23 ఏళ్ల యువతి తలకు కరడు కట్టిన ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ వెల కట్టింది. ఆమెను చంపితే పది లక్షల అమెరికన్ డాలర్లు ఇస్తామని ప్రకటించింది. డెన్మార్క్ కు చెందిన ప్రవాస కుర్దూ యువతి జొనా పలని సిరియాకు వచ్చి అక్కడి కుర్దు రక్షక దళాలతో కలిసి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను ఎదుర్కొంది. దీంతో ఆమెను మట్టుబేట్టేందుకు ఐఎస్ఐఎస్ వ్యూహరచన చేసింది. దీంతో ఆమెను పట్టించినా, చంపినా మిలియన్ అమెరికన్ డాలర్లను ఇస్తామని ప్రకటించింది.

ప్రస్తుతం పలని తన స్వదేశమైన డెన్మార్క్ లోనే కారాగారంలో ఉంది. 2015లో ఆమెను స్వదేశం వదలి వెళ్లవద్దని (ట్రావెల్ బ్యాన్) ఆదేశించినప్పటికీ ఆమె వెళ్లిపోవడంతో ఆమెపై విచారణ ప్రారంభమయింది. రెండు దశాబ్దాల క్రితం పలని చిన్నపిల్లగా ఉండగానే ఆమె తల్లిదండ్రులు డెన్మార్క్ లో ఆశ్రయం పొందారు. గత ఏడాది తన పాస్ పోర్ట్ ను డెన్మార్క్ లో స్వాధీనం చేసుకోవడంతో ట్విట్టర్ పోస్ట్ లో పలని ఘాటుగానే స్పందించింది. ఐఎస్ఐఎస్ పై ప్రత్యక్షంగానో, పరోక్షంగానే పోరాటం చేస్తున్న డెన్మార్క్ కో, మరో దేశానికో తాను ఎలా ముప్పు అవుతానని ప్రశ్నించింది. ప్రపంచానికి ఐఎస్ఐఎస్ పీడగా మారినప్పుడు తాను ఒక సిపాయిగా పోరాటం చేస్తే తప్పెలా అవుతుందని నిలదీసింది. ఐరోపా ఖండలో ఉండటంతో మహిళా హక్కుల పోరాటం స్ఫూర్తితో, డానిష్ మహిళగా తాను ఐఎస్ పై యుద్ధం చేసినట్టు ఫేస్ బుక్ పోస్ట్ లో పలని తెలిపింది.

ఇది కూడా చూడండి: ఈ ఈ రాసుల వాళ్ళు వివాహం చేసుకోకూడదట

ఇది కూడా చూడండి: ఈ వస్తువులు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలువదట

ఇది కూడా చూడండి: మీరు పుట్టిన నెలతో మీ మనస్తత్వం ఏంటో తెలుసుకోవచ్చు

English summary

Joanna palani young woman from Denmark. Palani Who Fought ISIS Is Jailed by Denmark government.