సైకి లెక్కేసిన మరో ఎంఎల్ఎ

Palaparthi David Raju Joins In TDP

04:35 PM ON 29th February, 2016 By Mirchi Vilas

Palaparthi David Raju Joins In TDP

ఇప్పటికే 5గురు ఎంఎల్ఎ లు , ఓ ఎంఎల్ సి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ వీడి టిడిపి తీర్ధం పుచ్చుకోగా, మరో ఎంఎల్ఎ కూడా సైకిలు ఎక్కేసాడు. దీంతో టిడిపిలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వైకాపా ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు ఆదివారం ఉదయం ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. అనంతరం చంద్రబాబు పార్టీ కండువా కప్పి డేవిడ్‌రాజును టిడిపిలోకి ఆహ్వానించారు. ఏపీ తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డేవిడ్‌రాజు మీడియాతో మాట్లాడుతూ... అభివృద్ధిలో భాగస్వామి అయ్యేందుకే తెలుగుదేశం పార్టీలో చేరినట్లు చెప్పారు. యర్రగొండపాలెంలో తాగునీటి సరఫరాకు రూ.4కోట్లు ఇచ్చేందుకు సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. నియోజకవర్గ సమస్యలను సీఎం ఓపికగా విన్నారని, వెలుగొండ ప్రాజెక్టు విషయంలో సీఎం శ్రద్ధ చూపిస్తున్నారన్నారు. జగన్మోహనరెడ్డి సంతమాగులూరు వచ్చిన సందర్భంగా తాము పార్టీ మారడం లేదని ప్రకటించడమే కాక డేవిడ్‌రాజుతోపాటు ప్రకాశం జిల్లాకు చెందిన మరో అయిదుగురు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌ వెళ్లి జగన్‌ను కలిసి ఇదే విషయాన్ని మరోమారు స్పష్టం చేశారు. ఇంతలోనే డేవిడ్‌రాజు పార్టీ మారడం వైకాపా వర్గాలను కలవరానికి గురిచేస్తోంది.

English summary

Prakasham district Yerragonda Palem Ysrcp MLA Palaparthi David Raju Joined in Telugu Desam Party.David Raju says that he joined in TDP for the sake of his constitution.Chandrababu Naidu welcomes him into the party.Upto now 6 MLA's and 1 MLC had join in TDP from Ysrcp party.