సుమంత్ తో ఫుల్ హ్యాపీ అంటున్న బ్యూటీ

Pallavi Subhash praises Sumanth

01:00 PM ON 16th July, 2016 By Mirchi Vilas

Pallavi Subhash praises Sumanth

థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి.. అటు టీవీల్లోను.. ఇటు సినిమాల్లోను సత్తా చాటుతోన్న కొత్త హీరోయిన్ పల్లవి సుభాష్ టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తోంది. పట్టుమని పది సినిమాలే చేసినా, ఈమె ఏజ్ మాత్రం 33 సంవత్సరాలు. అయినా ఈ భామ ట్వంటీస్ అన్నట్లుగా కనిపించడం స్పెషాలిటీ. ఇక హిందీలో సూపర్ హిట్ అయిన 'విక్కీ డోనర్' ను తెలుగులో సుమంత్ హీరోగా రీమేక్ చేస్తుంటే, మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. తనను ఈ మూవీలో రోల్ కోసం సంప్రదించినపుడు చాలా హ్యాపీగా ఫీలయినట్లు పల్లవి చెబుతోంది. థియేటర్ ఆర్టిస్ట్ గా చేసిన నాకు రిహార్సల్స్ లో డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడం బాగా అలవాటు.

కానీ తెలుగు రాకపోవడంతో.. ఇబ్బంది పడ్డా. ఆ సమయంలో సుమంత్ చేసిన హెల్ప్ సామాన్యమైనది కాదు. హీ ఈజ్ రియల్ జెంటిల్మన్. డైలాగ్స్ కోసం డిక్షన్ లో సాయం చేయడమే కాదు.. నేను సెట్స్ లో కంఫర్ట్ గా ఉండేలా చూసుకున్నారు అని పల్లవి సుభాష్ చెబుతోంది. విక్కీ డోనర్ లో యామీ గౌతమ్ చేసిన రోల్ అంటే తనకు చాలా ఇష్టమని పల్లవి చెప్పడమే కాదు, ఆ రోల్ చేయాలని దర్శకుడు మల్లిక్ రామ్ అడిగినపుడు ఎగిరి గంతేసినంత పని చేసిందట. ఇలాంటి గ్రేట్ మూవీతో సుమంత్ తో కలిసి టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్నందుకు ఫుల్ హ్యాపీ అంటోంది మరి. సుమంత్ అంతగా ఇంప్రెస్ చేశాడా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

English summary

Pallavi Subhash praises Sumanth