రూ 2లక్షలు జమచేశారా.. అయితే ఈ రూల్స్ వర్తిస్తాయి

PAN Card Mandatory For Money Transactions

12:25 PM ON 16th December, 2016 By Mirchi Vilas

PAN Card Mandatory For Money Transactions

పెద్ద నోట్ల రద్దు తర్వాత వస్తున్న ఇబ్బందులను ఓ పక్క సరిచేయడానికి చర్యలు చేపడుతున్న ఆర్ బి ఐ మరో పక్క నగదు విత్ డ్రాపై రూల్స్ అమలు చేస్తోంది. తాజాగా ఆర్బీఐ తాజాగా మరి కొన్ని ఆంక్షలు విధించింది. వీటి ప్రకారం.. పెద్దనోట్ల రద్దు తర్వాత రూ.2 లక్షలు అంతకన్నా ఎక్కువ డబ్బు జమ చేసిన వారు, రూ.5 లక్షలకుపైగా డబ్బు ఉన్న ఖాతాదారులు నగదు విత్ డ్రా చేసుకొనేందుకు పాన్ తప్పనిసరిగా సమర్పించాలి. పాన్ లేకుంటే ఫాం 60 సమర్పించాలి. ఈ నిబంధన నగదు బదిలీకి కూడా వర్తిస్తుంది. చిన్న ఖాతాదారులు (జన్ ధన్ ఖాతాదారులు) ఈ ఏడాది రూ.లక్షకు మించి డిపాజిట్ చేసినా వారికి ప్రతి నెలా విత్ డ్రా పరిమితి 10వేలుగానే ఉంటుంది. కొన్ని బ్యాంకుల్లో కేవైసీ నిబంధనలను పాటించడం లేదని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిబంధనలు విధించింది. బ్యాంకులు, ఎన్ బీఎఫ్ సీలు ఇకపై పైన పేర్కొన్న ఖాతాల్లో ప్రతి లావాదేవీకీ పాన్ ను తప్పనిసరిగా కోట్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఇది కూడా చూడండి: ఫీజు డబ్బులతో ఫోర్న్ చూస్తున హైదరాబాద్ పోరగాళ్ళు

ఇది కూడా చూడండి: ఏటీఎంలో దొంగనోట్లు

ఇది కూడా చూడండి: సన్నీకి బంపరాఫర్ - అయినా పైకి చెప్పడంలేదట

English summary

PAN Card Mandatory For Money Transactions