మరో దఫా 'పనామా పేపర్స్' మహా రిలీజ్

Panama Papers List To Release On May 9th

11:13 AM ON 28th April, 2016 By Mirchi Vilas

Panama Papers List To Release On May 9th

అడ్డదిడ్డంగా సంపాదించిన నల్లసొమ్మును గుట్టుచప్పుడు కాకుండా దేశం సరిహద్దులు దాటించేసిన ఘనుల జాతకాన్ని బట్టబయలు చేసిన ‘పనామా పేపర్స్’ ఇప్పుడు మరో సారి అలాంటి పెద్ద ప్రయత్నం చేయబోతోందట. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టల కన్సార్టియం ఒకటి నెలల తరబడి చేసిన పరిశోధనతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖుల చీకటి బతుకులు బయటకు రావటం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్స్ కు మరికొద్ది రోజుల్లో ప్రపంచ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. మే 9న ఇందుకు ముహూర్తం కూడా నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఏప్రిల్ 4న బయటకు వచ్చిన పనామాపేపర్స్ కుంభకోణానికి సంబంధించిన 1.15కోట్ల రహస్య పత్రాల్ని ప్రపంచ ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆఫ్ షోర్ లీక్స్.ఐసీఐజే.ఓఆర్ జీ అన్న పేరిట ఒక వెబ్ సైట్ లో ఈ రహస్య పత్రాల్ని బయట పెట్టనున్నట్లు తాజాగా ప్రకటించారు. పనామా పేపర్స్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలువురు రాజకీయ నేతలు.. సెలబ్రిటీలు చట్టపరమైన చిక్కుల్లో చిక్కు కున్నారు కూడా. ఇప్పుడు ఎలాంటి విషయం పోక్కుతున్దోనని అంతా ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:గూగుల్, ఫేస్‌బుక్‌ సెకనుకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?

ఇవి కూడా చదవండి:విమానం టాయ్‌లెట్‌లో 7కేజీల బంగారం!!

English summary

Anther Panama Papers list was going to be release on next month on May 9th. First list of Panama papers have created sensation around the the world.Now another list was going to release sensation .